దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి లీడర్ ఉదాహరణ చాలు. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా సమకాలీన రాజకీయ అంశాలను అందులో చూపించిన తీరు దాన్నో కల్ట్ క్లాసిక్ గా మార్చేసింది. వచ్చే వారం మే 9 రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఎపిసోడ్ లో రానా రూలింగ్ పార్టీ మంత్రులకు వందల సంఖ్యలో ఉన్న కరెన్సీ నోట్ల కట్టలను ఇచ్చే సీన్ బాగా పేలింది. ఇలా నిజంగా జరుగుతుందానే కామెంట్స్ అప్పట్లో చాలా వచ్చాయి. ఇప్పుడది మాములు విషయమైపోయింది.
తాజాగా కుబేరలోనూ శేఖర్ కమ్ముల ఇదే ఫార్ములా వాడబోతున్నాడు. నిన్న వదిలిన నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక కంటైనర్ నిండా డబ్బుంటే వాటిని చూస్తూ వర్షం గొడుగు పట్టుకున్న కింగ్ స్టిల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఎలాంటి పాత్రనే క్లూస్ ఇవ్వకపోయినా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తరహాలో చాలా ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ ఉంటుందట. చిల్లిగవ్వ లేకుండా తిరిగి లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మారే ధనుష్ చీకటి రహస్యాలను వెలికి తీసే అధికారికా నాగ్ ని కొత్తగా చూడబోతున్నారని యూనిట్ లీక్. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ అంచనాలు పెంచుతోంది.
విడుదల తేదీ ఇంకా ఖరారు కాని కుబేరని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని నిర్మాతల ఆలోచన. వచ్చే సంక్రాంతికి దింపడం కన్నా పోటీ లేకుండా సోలోగా వచ్చే ఆప్షన్ అయితే ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి స్పందన వస్తుందని వాళ్ళ భావన. అయితే ప్రస్తుతానికి ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా ఎన్నో భారీ చిత్రాలు డేట్ల కోసం ప్లాన్ చేసుకున్నాయి. కొన్ని అఫీషియల్ అనౌన్స్ మెంట్లు రాగా మరికొన్ని అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. కుబేర ఏ స్లాట్ దక్కించుకుంటాడో చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మనీ థ్రిల్లర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
This post was last modified on May 3, 2024 4:50 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…