హీరోతో పడుకుంటేనే ఛాన్సిచ్చారు

బాలీవుడ్‍లోని బంధుప్రీతి, ఇతర దాష్టీకాలపై దండెత్తుతోన్న కంగన రనౌత్‍ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ‘తిన్న కంచంలోనే కక్కే రకం’ అంటూ రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్‍ భార్య జయాబచ్చన్‍ చేసిన వ్యాఖ్యలతో కంగన శివాలెత్తుతోంది. తన కంచంలో ఎవరూ వడ్డించలేదని, తన ‘తాలీ’ (భోజనం) తానే తయారు చేసుకున్నానని, తనకు మొదట్లో బాలీవుడ్‍ పెట్టిన భోజనంలో ఒక రెండు నిమిషాల క్యారెక్టర్‍, ఒక ఐటెమ్‍ సాంగ్‍ వుండేవని, అది కూడా హీరోతో పడుకుంటేనే ఆ మాత్రం దక్కేదని కంగన ఘాటుగా స్పందించింది.

అయినా తన కూతురికి టీనేజీలో బాలీవుడ్‍లో ఇవే కష్టాలు వచ్చినా, తన కొడుకు కూడా అష్టకష్టాలు పడి ఉరి వేసుకుని చనిపోయినా జయ ఇలా మాట్లాడేవారా అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. జనరల్‍గా కంగనకు ఎదురు మాట్లాడ్డానికి ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఒక్కసారి ఆమెకు ఎదురు మాట్లాడగానే కంగన ఇలాగే స్పందిస్తూ వుంటుంది.

తేనెతుట్టెను కదపడం దేనికన్నట్టు ఆమె తమపైనే వ్యాఖ్యలు చేసినా కానీ స్పందించకుండా గమ్మున వుండిపోతుంటారు. అయితే బాలీవుడ్‍పై మీడియా చేస్తోన్న ప్రచారంతో జయ స్పందించి కంగన లాంటి ఇండస్ట్రీ మనుషులే మీడియాకు సినిమా వాళ్లను చులకన చేస్తున్నారని ఆమె పేరెత్తకుండానే ఆమె మాట్లాడారు. దానికి కంగన ఈ రేంజ్‍లో రివర్స్ ఎటాక్‍ చేసింది.