నిర్మాణంలో ఉన్న టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల్లో భారీ క్రేజ్ దక్కించుకున్న వాటిలో పుష్ప 2 ది రూల్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పోస్టర్ వచ్చినా చిన్న అప్డేట్ చూసినా అభిమానుల ఎగ్జైట్ మెంట్ తారాస్థాయిలో ఉంటోంది. అలాంటిది మొదటి లిరికల్ వీడియోగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కేవలం ముప్పై సెకండ్ల చిన్న ప్రీ ఆడియోకే సోషల్ మీడియా ఊగిపోయింది. పాజిటివ్ నెగటివ్ రెండు రకాల స్పందనలు మూటగట్టుకుంది. ఇక పూర్తి పాట ఎలా ఉంటుందోననే ఆసక్తి ఫ్యాన్స్ తో పాటు మ్యూజిక్ లవర్స్ లోనూ విపరీతంగా నెలకొంది.
నకాజ్ అజీజ్, దీపక్ బ్లూ జంట గాత్రంలో పుష్పరాజ్ పాత్ర లక్షణాలను వర్ణిస్తూ ఆస్కార్ విజేత చంద్రబోస్ సమకూర్చిన సాహిత్యం మూడు చరణల్లో మాస్ కి మంచి కిక్ ఇచ్చేలా సాగింది. నువ్వు గెడ్డం అట్టా సవరిస్తుంటే దేశమే దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడుస్తూ ఉంటే భూమే బద్దలయ్యే అంటూ మొదలుపెట్టి మధ్యలో ఎవరికీ తలవంచకుండా బాస్ లా బ్రతకాలంటే ఎలా ఉండాలో చెబుతూ అమ్మకు దేవుడికి తప్ప ఎవరికీ తలవంచని పుష్ప నైజాన్ని పదాల రూపంలో బయట పెట్టారు. షూ వేసుకుని మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు వెరైటీగా అనిపిస్తాయి.
మొత్తానికి అంచనాలు నిలబెట్టుకోవడంలో మొదటి పాట సక్సెసయిందనే చెప్పాలి. దీనికి కూడా నెగటివ్ రియాక్షన్లు, ఫీడ్ బ్యాక్లు రావొచ్చేమో కానీ వినగా వినగా ఎక్కడం ఖాయమనిపించేలా ఉంది. పుష్ప 1 టైటిల్ సాంగ్ రేంజ్ లో ఉందా అంటే పోలిక పరంగా చెప్పలేం కానీ దేవిశ్రీప్రసాద్ కంపోజింగ్ డిఫరెంట్ గా ఉన్న మాట వాస్తవం. ఎక్కువ విజువల్స్ లేకుండా ఒక స్టెప్పుతో సరిపెట్టిన దర్శకుడు సుకుమార్ పూర్తి వెర్షన్ కోసం కంటెంట్ ఎక్కువ రివీల్ చేయలేదు. తెలుగులో ఓకే అనిపించుకుంది కాబట్టి మిగిలిన భాషల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
This post was last modified on May 1, 2024 5:25 pm
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…