యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్. ముఖ్యంగా ‘గీత గోవిందం’తో అతడి పేరు మార్మోగిపోయింది. విజయ్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ హీరోను పెట్టి వంద కోట్ల సినిమాను డెలివర్ చేయడం అంటే మాటలు కాదు. ఆ సినిమా ఎవ్వరూ ఊహించనంత పెద్ద విజయం సాధించి పరశురామ్‌ను టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా మార్చింది.
అరడజనుకు పైగా పేరున్న నిర్మాణ సంస్థలు అతడికి అడ్వాన్సులిచ్చాయి. స్టార్ హీరోలు తనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ చేసే ఛాన్సొచ్చింది పరశురామ్‌కు. కానీ మహేష్ అభిమానుల ఆకాంక్షలను నిలబెట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు పరశురామ్. రిలీజ్ టైంలో అనుకున్న దాని కంటే బెటర్‌గా ఆడినప్పటికీ అది అంతిమంగా డిజాస్టర్‌గానే నిలిచింది.
ఈ సినిమా కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు, డైలాగులు ట్రోల్ మెటీరియల్‌గా మారాయి తర్వాతి రోజుల్లో. ఐతే తర్వాతి చిత్రంతో అయినా తప్పులు సరిదిద్దుకుంటాడనుకుంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ రూపంలో మరింత పేలవమైన సినిమాను అందించాడు. ఈ సినిమా రిలీజ్ టైంలో మామూలుగా అన్ పాపులర్ కాలేదు పరశురామ్. లాజిక్ లెస్ సీన్లు, అర్థరహితమైన డైలాగుల పట్ల తీవ్ర విమర్శలు తప్పలేదు. అప్పుడు అయిన బ్యాండు చాలదన్నట్లు ఇప్పుడు ఓటీటీలో సినిమా రిలీజయ్యాక ఇంకో రౌండ్ పరశురామ్‌ను ఆడుకుంటున్నారు నెటిజన్లు.
పరశురామ్‌కు ఇంతకు ముందు కూడా ఫ్లాపులు లేక కాదు కానీ.. ‘ఫ్యామిలీ స్టార్’తో జరిగింది మాత్రం మామూలు డ్యామేజ్ కాదు. ఈ పరిస్థితుల్లో అతను కొత్త దక్కించుకోవడం చాలా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రామ్‌తో ఓ సినిమా చేద్దామని ప్రయత్నిస్తున్నాడట కానీ.. అతను ఒప్పుకుంటాడా? ఈ సినిమాకు నిర్మాత దొరుకుతారా.. అన్నీ ఓకే అయినా రెండు డిజాస్టర్ల తర్వాత పరశురామ్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుంది.. అన్నదే ప్రశ్నార్థకం.
This post was last modified on April 30, 2024 11:44 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…