మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ ఒకేచోట కలిసేలా నిర్వాహకులు స్వయంగా ఆహ్వానించి మరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బి స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్ కి ఎవరైనా వెళ్లొచ్చు. కాకపోతే టికెట్లు కొనాలి. 499, 999, 1999 ఇలా మూడు క్యాటగిరీలుగా ధరలు నిర్ణయించి వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని పరిశ్రమకు చెందిన వివిధ సంక్షేమ పధకాల కోసం ఉపయోగించబోతున్నారు. ఊహించని మెరుపులు, సంఘటనలు చాలా ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.
చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ, నాని, తమన్నా, పూజా హెగ్డే ఖచ్చితంగా వచ్చే లిస్టులో ఉన్నారు. ఆ మేరకు అఫీషియల్ బుకింగ్స్ ఇన్ఫోలో ఫోటోలు కూడా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందు వల్ల బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు హాజరు కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ఉండటంతో రావడం డౌటే. మహేష్ బాబు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదట. మీడియం రేంజ్ హీరోల నుంచి పక్కా అనే మెసేజ్ వచ్చాక ఆ వివరాలు అప్డేట్ చేస్తారు. రాజమౌళి, సుకుమార్ లతో మొదలుకుని ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సాయి రాజేష్ దాకా దాదాపు అందరు దర్శకులు అక్కడే ఉంటారు.
ఈ సందర్భంగా డాన్సులు, స్కిట్లతో పాటు దాసరి తీసిన బ్లాక్ బస్టర్స్ నుంచి కొన్ని సన్నివేశాలు, పాటలు రీ క్రియేట్ చేసి వాటిని స్టేజి మీద ప్రదర్శించబోతున్నట్టు తెలిసింది. రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు డాన్సులు చేయబోతున్నారట. దాసరి గారిని ఉద్దేశించింది కాబట్టి ఆయన గొప్పదనం హైలైట్ అయ్యేలా పలు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల నుంచి నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే ప్లాన్ చేసి ఈ వేడుకకు శాశ్వత గుర్తింపు తేవాలనేది సభ్యుల లక్ష్యం. చూస్తుంటే నెరవేరేలానే ఉంది.
This post was last modified on April 30, 2024 4:02 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…