ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో ఆమె కొంచెం గ్లామర్ డోస్ పెంచింది. సినిమా చివర్లో పెదవి ముద్దులు కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడూ చూసే లిప్ లాక్స్‌లా కాకుండా షార్ట్ డ్యూరేషన్లో సాగాయి అవి. గత ఏడాది ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్-2’లో ఇంటిమేట్ సీన్లు కూడా చేసింది.
బాలీవుడ్లో చేసిన వేరే చిత్రాలు కొన్నింట్లో కొంచెం ఘాటుగా కూడా నటించింది. కానీ ఇప్పుడైతే ఇవి కొంచెం అలవాటు అయ్యాయి కానీ.. కెరీర్ ఆరంభంలో మాత్రం చిన్న ముద్దు సీన్ అన్నా కూడా భయపడిపోయేదాన్నని.. కేవలం కిస్, ఇంటిమేట్ సీన్లు ఉన్నాయని పెద్ద సినిమాలు కూడా వదులుకున్నానని అంటోంది మృణాల్. ఏదైనా కథ చెప్పినపుడు ముద్దు సీన్లు ఉన్నాయని అనగానే తనకు తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారని.. అవి చూస్తే వాళ్లు ఏమనుకుంటారో అన్న భయంతో ఆ తరహా సీన్లకు నో చెప్పేసేదాన్నని మృణాల్ వెల్లడించింది.
కానీ నెమ్మదిగా ముద్దు సీన్లు, ఇంటిమేట్ సీన్లు కూడా కథలో భాగమే అని అర్థం చేసుకున్నాక తన తల్లిదండ్రులకు వాటి గురించి సర్ది చెబితే సరే అన్నారని.. ఆ తర్వాత తాను అ సీన్స్ కూడా చేయడం మొదలుపెట్టానని మృణాల్ తెలిపింది. కెరీర్ ఆరంభంలో ఒక భారీ ప్రాజెక్టును ఇంటిమేట్ సీన్లు చేయలేకే వదులుకున్నపుడు బాధగా అనిపించిందని ఆమె చెప్పింది. తెలుగులో సీతారామం లాంటి అందమైన ప్రేమకథలో ఎంతో పద్ధతిగా కనిపించాక మృణాల్ నుంచి ప్రేక్షకులు ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లు పెద్దగా ఆశించట్లేదు.
This post was last modified on April 29, 2024 10:38 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…