ప్రెస్ మీట్ కావొచ్చు ఇంకేదైనా ప్రమోషనల్ ఈవెంట్ కావొచ్చు సినిమాకు సంబంధించిన నటీనటులు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. లేదంటే సోషల్ మీడియా కాలంలో వ్యవహారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరికి అలాంటి అనుభవమే ఎదురవుతోంది. అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించగా ఈమె కీలక పాత్రలో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి వచ్చే నెల విడుదల కానుంది. ఇటీవలే వచ్చిన టీజర్ కొంచెం కొత్తగా ఉన్న ఫీలింగ్ కలిగించింది. ఈ సందర్భంగా జరిగిన ఒక చిట్ ఛాట్ ప్రోగ్రాంలో చాందిని చౌదరికి ఓ ప్రశ్న ఎదురయ్యింది.
ఐపీఎల్ లో ఎవరికి మద్దతు ఇస్తారని ఓ యువకుడు అడిగాడు. దానికి సమాధానంగా ఇప్పటికీ లైవ్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచులు చూడలేదని, త్వరలో చూస్తానని చెబుతూ తమ ఆంధ్రప్రదేశ్ టీమ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి ఎవరికీ సపోర్ట్ లేదని చెప్పింది. దానికా అబ్బాయి అదేంటీ హైదరాబాద్ ఉంది కదాని అంటే, మా రాష్ట్రం కాదని చెప్పడం ఎస్ఆర్ హెచ్ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. భాగ్యనగరంలో ఉంటూ ఇక్కడే కెరీర్ ని నిర్మించుకుని కనీసం మాట వరసకు మద్దతు తెలుపకపోవడం ఏంటని ఎక్స్ తదితర మాధ్యమాల వేదికగా నిలదీయడం మొదలుపెట్టారు.
నిజానికి ఏపీ తెలంగాణతో సంబంధం లేకుండా తెలుగు వాళ్ళు ఎస్ఆర్ హెచ్ ని ఇష్టపడటం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏపీ ఫ్రాంచైజ్ లేదనే ఫీలింగ్ జనంలో పెద్దగా లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా చాందిని చౌదరి మాకు వైజాగ్ లేదా విశాఖపట్నం పేరుతో టీమ్ ఉండాలని అర్థం వచ్చేలా మాట్లడటం చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే గామితో మంచి హిట్ అందుకున్న చాందిని చౌదరి నెక్స్ట్ బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబోలో మూవీలో కీలక పాత్ర దక్కించుకుంది. అందం, టాలెంట్ రెండూ ఉన్న ఈ కలర్ ఫోటో అమ్మాయి ఇప్పటిదాకా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు.
This post was last modified on April 29, 2024 8:16 pm
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…