కీర్తి సురేష్ చిన్న స్థాయి కథానాయికగా ఉన్నపుడు తెలుగులో మొదటగా ఒప్పుకున్న సినిమా ‘ఐనా ఇష్టం నువ్వు’. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ హీరోగా పరిచయం కావాల్సిన సినిమా ఇది. ‘నందిని నర్సింగ్ హోమ్’ కంటే ముందు అతను ఈ సినిమానే మొదలుపెట్టాడు. కీర్తి సైతం తెలుగు తెరకు ఈ చిత్రంతోనే పరిచయం కావాల్సింది. కానీ ‘నేను శైలజ’నే ముందు విడుదలైంది.
‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా అనివార్య కారణాల వల్ల చివరి దశలో ఆగిపోయింది. ఆ తర్వాత అది ఎంతకీ విడుదల కాలేదు. ఈలోపు కీర్తి చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఐతే ఇప్పుడు కీర్తి ‘మహానటి’తో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన సమయంలో ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాను ‘జానకితో నేను’ అని టైటిల్ మార్చి త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా.. దాన్ని పూర్తి చేయడానికి కీర్తి షూటింగ్‌కు కూడా హాజరు కాబోతోందని, ఇప్పుడు తన స్థాయికి తగని సినిమా అయినా సరే.. తన బాధ్యతగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటోందని వార్తలొచ్చాయి. ఐతే జనాల్లో ఏమంత ఆసక్తి లేని ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత విడుదలవడమే గొప్ప అనుకుంటుంటే.. మళ్లీ దాని మీద వివాదం మొదలైంది.
టాలీవుడ్లో వివాదాలకు పెట్టింది పేరైన నట్టి కుమార్ ఈ సినిమాను సీనియర్ నిర్మాత చంటి అడ్డాల విడుదల చేస్తామనని ప్రకటించడం పట్ల అభ్యంతరం చెబుతున్నాడు. చంటి నుంచి ఈ సినిమా హక్కులు ఎప్పుడో కొన్నానని.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా తన దగ్గర ఉన్నాయని.. ఈ సినిమా తన సొంతమని.. మరి చంటి ఎలా రిలీజ్ చేస్తాడని అతను ప్రశ్నించాడు. మరి ఇలా వివాదం ముసురుకున్న సినిమాను పూర్తి చేయడానికి కీర్తి ముందుకొస్తుందా.. ఈ సినిమా నిజంగా విడుదలవుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది.
This post was last modified on September 16, 2020 4:38 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…