ఎంత స్టార్ సపోర్ట్ ఉన్నా సినిమాలో దమ్ము లేకపోతే ఏం చేయలేమని బాక్సాఫీస్ ఎన్నోసార్లు రుజువు చేసింది. తాజాగా మరో ఉదాహరణ తోడయ్యింది. మొన్న శుక్రవారం ఆయుష్ శర్మ రుస్లాన్ రిలీజయ్యింది. ఇతను ఎవరంటే సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ భర్త. బావకు కెరీర్ ఇవ్వాలనే ఉద్దేశంతో కండల వీరుడు 2021 అంతిమ్ లో ఎక్కువ లెన్త్ ఉన్న క్యామియో చేసి దాని వసూళ్లకు దోహదపడ్డాడు. కారణం డెబ్యూ మూవీ లవ్ యాత్రి దారుణంగా బోల్తా కొట్టడమే. రుస్లాన్ తో స్వంతంగా కుదురుకుంటాడు లెమ్మని ఎలాంటి చేయూత ఇవ్వకుండా వదిలేశాడు. కట్ చేస్తే బొమ్మ మాములు డిజాస్టర్ కాలేదు.
ఓపెనింగ్స్ కేవలం రెండు కోట్ల పై చిలుకు మాత్రమే వసూలు కావడం చూస్తే ఆడియన్స్ ఏ స్థాయిలో దీన్ని తిరస్కరించారో అర్థమవుతుంది. దక్షిణాది నిర్మాత కెకె రాధామోహన్ గంపెడు ఆశలతో చేసిన బాలీవుడ్ ప్రొడక్షన్ డెబ్యూ ఇది. జగపతిబాబు లాంటి తెలుగు ఆర్టిస్టులు కీలక పాత్ర చేయడంతో మన దగ్గర అంతో ఇంతో బిజినెస్ జరుగుతుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. కేవలం 8 శాతం లోపు ఆక్యుపెన్సితో థియేటర్లలో షో వేయడమే భారంగా అనిపించేలా రుస్లాన్ దెబ్బ కొట్టింది. రివ్యూలు, పబ్లిక్ రెండు పోటీ పడి మరీ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మరో ప్రతికూలాంశం.
కథా కాకరకాయ లేకుండా కేవలం హంగులు, భారీతనాన్ని నమ్ముకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో రుస్లాన్ సాక్ష్యంగా నిలుస్తోంది. కరణ్ లలిత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాని నీరసమైన స్క్రీన్ ప్లే, పస లేని సన్నివేశాలు ప్రేక్షకులను పరుగులు పెట్టించాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి దత్తతకు వెళ్లిన ఓ తీవ్రవాది కొడుకు తన దేశభక్తిని నిరూపించుకునే క్రమంలో ఏమేం చేశాడనే పాయింట్ మీద ఈ కళాఖండాన్ని రూపొందించారు. బడేమియా చోటేమియా గాయమే రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తున్న బయ్యర్లకు ఇప్పుడీ రుస్లాన్ రూపంలో మరో బలమైన శరాఘాతం కలిగింది.
This post was last modified on April 29, 2024 12:24 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…