మొదట్లో చిన్న సినిమాలు తీసిన మారుతి.. ‘భలే భలే మగాడివోయ్’తో తన రేంజ్ మార్చుకున్నాడు. ఆ సినిమాతో భారీ విజయాన్నందుకున్న అతను హాట్ షాట్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక అప్పట్నుంచి పేరున్న హీరోలతో మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మధ్యలో సీనియర్ హీరో వెంకటేష్‌ను కూడా డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. కానీ వీళ్ల కలయికలో వచ్చిన ‘బాబు బంగారం’ అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత మళ్లీ మీడియం రేంజ్ హీరోలకే పరిమితం అయిపోయాడు. శర్వానంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్‌లతో వరుసగా సినిమాలు తీశాడు మారుతి. ఐతే ఇప్పుడు మళ్లీ మారుతి కొంచెం రేంజ్ పెంచి పెద్ద సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ నిర్మాణ భాగస్వామి అయిన యువి క్రియేషన్స్ బేనర్లో మారుతి ఓ సినిమా చేయబోతున్నాడట.
ఈ చిత్రానికి హీరోగా మాస్ రాజా రవితేజ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ముందు శర్వానంద్ హీరోగా మారుతి తర్వాతి సినిమా అని వార్తలొచ్చాయి కానీ.. తాజా సమాచారం ప్రకారం రవితేజ పేరు వినిపిస్తోంది. మాస్ రాజా సినిమా అంటే కొంచెం పెద్ద రేంజిలోనే ఉంటుంది. మారుతితో అతడి కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే. సరైన సినిమా పడితే రవితేజ ఇప్పటికే భలేగా ఎంటర్టైన్ చేయగలడు. ఐతే అతడితో తీస్తే సూట్ కాని కొత్త తరహా సినిమాలు చేస్తున్నారు. లేదంటే మరీ రొటీన్‌గా లాగిస్తున్నారు.
మారుతిలా రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ఎంటర్టైనర్ తీసే దర్శకుడు రవితేజను బాగా డీల్ చేయగలడని చెప్పొచ్చు. మరి నిజంగా ఈ సినిమా ఖరారవుతుందేమో చూడాలి. ప్రస్తుతం ‘క్రాక్’ను పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. మరి దాని కంటే ముందే మారుతి సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.
This post was last modified on September 16, 2020 4:37 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…