Movie News

సాయిపల్లవిని టార్గెట్ చేసుకుంటున్నారు

నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సీత లుక్స్ బాగాలేవని ఒక వర్గం కామెంట్ చేస్తుండగా, మరో బ్యాచ్ గతంలో ఆమె కాశ్మీర్ ఫైల్స్ గురించి అన్న మాటలను వక్రీకరించి కట్ చేసిన వీడియోలను వైరల్ చేసే పనిలో పడింది. ఇదంతా ఒక సౌత్ హీరోయిన్ ఇంత గొప్ప పాత్ర దక్కించుకుందనే అక్కసుతో వచ్చిందే తప్ప మరొకటి కాదని సాయిపల్లవి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇలా కావాలని బురద జల్లడం వల్ల ఏమొస్తుందని నిలదీస్తున్నారు.

ఒకవేళ సాయిపల్లవిని నిజంగానే కామెంట్ చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ట్రోలింగ్ రన్బీర్ కపూర్ ని కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లుక్స్ పరంగా రాముడిగా అంత నప్పలేదనే ఫీడ్ బ్యాక్ తన మీద వినిపిస్తోంది. అసలు ఎక్కడో దూరంగా కెమెరా పెట్టి తీసిన లీక్డ్ పిక్స్ ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయనవసరం లేదు. యూనిట్ భవిష్యత్ లో టీజరో పోస్టరో వదిలినప్పుడు అప్పుడు ఏదైనా అనే హక్కు అందరికీ ఉంటుంది. అలా కాకుండా స్పష్టత లేని ఇమేజెస్ ని తీసుకుని ఇలా నెగటివ్ క్యాంపైన్ చేయడం పట్ల ఫిదా భానుమతి ఫాలోయర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరెంత గగ్గోలు పెట్టినా సీతగా సాయిపల్లవి పెర్ఫార్మన్స్ పట్ల ఎవరికీ అనుమానం లేదు. ఆదిపురుష్ లో కృతి సనన్ కన్నా బెటర్ గా ఉంటుందనే మాటని మాత్రం ఖచ్చితంగా తప్పని చెప్పొచ్చు. అమీర్ ఖాన్ కొడుకు డెబ్యూలో నటిస్తున్న సాయిపల్లవి మొత్తం రెండు సినిమాలతో హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో నాగచైతన్య తండేల్, తమిళంలో శివకార్తికేయన్ అమరన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రామాయణం కోసం రికార్డు స్థాయిలో సాయిపల్లవికి ముప్పై కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇస్తున్నారనే వార్త ఆల్రెడీ టాక్ అయ్యింది. నిజమేంటో కానీ నిప్పులేని పొగ ఎందుకొస్తుంది.

This post was last modified on July 7, 2025 11:21 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago