కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్ 13 విడుదలని లాక్ చేసుకుని ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆల్రెడీ లీక్ తిరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరికాస్త బలం చేకూరేలా ఒక కీలక అప్డేట్ వచ్చింది.
వచ్చే నెల మే 16 ఈ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. అప్పటికంతా ఎన్నికల వేడి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇండియన్ 2కి బజ్ పెంచడానికి దీన్ని మొదటి మెట్టుగా వాడుకోబోతున్నారు.
అసలు విశేషం ఇది కాదు. ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం దాదాపు ఫిక్సైనట్టేనని చెన్నై మీడియా టాక్. గేమ్ ఛేంజర్ ఎలాగూ దర్శకుడు శంకర్ తీస్తోందే కావడంతో చరణ్ నో చెప్పడమంటూ ఉండదు. పైగా కమల్ వేడుక. ఇక రజనికి రెండు వైపులా బాండింగ్ ఉన్న ఈవెంట్ ఇది.
ప్రాణ స్నేహితుడి, ఒకపక్క ఇంకో వైపు తనకు మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ ఇంకోవైపు. ఎందుకు నో చెబుతారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఇద్దరు సీనియర్ దిగ్గజాల మధ్య చరణ్ కనిపించడం కనులపండుగలా ఉంటుంది. సోషల్ మీడియా ఊగిపోతుంది.
అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చు. కల్కి ఏడి 2898 డేట్ వచ్చేసింది కానీ దానికి రెండు వారాల కన్నా ముందు వచ్చేలా భారతీయుడు 2 రెడీ అవుతోంది. మే చివరి వారంలో ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ ఉంటుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, బాబీ సింహ, బ్రహ్మానందం తదితరులు కీలక తారాగణంగా వ్యవహరించిన ఇండియన్ 2కి అనిరుద్ రవిచందర్ ఎలాంటి సంగీతం అందించాడోనని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
జూన్ లో ఇది వచ్చేస్తుంది కనక గేమ్ ఛేంజర్ చివరి దశ పనులు, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ తదితర పనులన్నీ చూసుకునే వెసులుబాటు శంకర్ కు దక్కుతుంది.
This post was last modified on April 28, 2024 4:12 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…