Movie News

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్తుందనుకుంటే ఇంకొన్ని అడుగులు కిందకు జార్చేయడం ఎప్పటికీ జీర్ణించుకోలేరు.

దీని దెబ్బకే గత సంవత్సరమే ప్రారంభం కావాల్సిన యువి క్రియేషన్స్ సినిమా స్క్రిప్ట్ మెరుగుదల పేరుతో ఆలస్యమవుతూనే ఉంది. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి సిచువేషన్ చెప్పనక్కర్లేదు. ఏజెంట్ ఫలితం చూశాక కూడా పవన్ కళ్యాణ్ ఒక ఛాన్స్ ఇచ్చాడు కానీ నిజంగా అది సెట్స్ పైకి వెళ్ళేదాకా నమ్మలేని పరిస్థితి నెలకొంది.

సరే ఇదంతా గతమేలే కానీ ఏజెంట్ ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. సోనీ లివ్ సంస్థ పలుమార్లు ప్రీమియర్ల కోసం డేట్ వేసి చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటూ వస్తోంది. నిర్మాత అనిల్ సుంకరని అడిగితేనేమో హక్కులు అమ్మేశాను కాబట్టి నాకు సంబంధం లేదని చెబుతున్నారు.

పోనీ శాటిలైట్ టెలికాస్ట్ అయినా జరిగిందా అంటే అదీ లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్ వేసిన కేసు వల్లే జాప్యం జరుగుతోందనే సంగతి అర్థమవుతోంది కానీ అసలది పరిష్కారానికి నోచుకుంటుందా లేదా అనేదే అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఫ్యాన్స్ వెయిటింగ్ కొనసాగుతూనే ఉంది.

డిజాస్టర్ అయ్యింది కాబట్టి ట్రోలింగ్ చేస్తారనే కారణంతో అఖిల్ ఫాన్స్ ఈ ఏజెంట్ లో డిజిటల్ లో రాకపోవడమే మంచిదని కోరుకోవచ్చు. కానీ ఇంతకన్నా దారుణమైన సూపర్ ఫ్లాపులు ఎన్నో అందరు హీరోలు చవిచూశారు. అవన్నీ ఓటిటి, యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.

మంచో చెడో సినిమా ఫలితం ఎలా ఉన్నా దాన్ని చిన్ని తెరపై తీసుకురావడం వల్ల థియేటర్లో మిస్ అయిన కోట్లాది ప్రేక్షకులు కనీసం ఇంట్లో చూసే అవకాశం దక్కుతుంది. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే మంచిదే. అన్నట్టు అఖిల్ 6 ని వేసవి పూర్తయ్యాక మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

This post was last modified on April 28, 2024 11:59 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago