ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. కానీ కొన్ని మాత్రం స్ట్రాటజీ ప్రకారం విడుదల చేసుకుంటే మంచి ఫలితాలు దక్కించుకుంటాయి. వకీల్ సాబ్ అదే చూపించబోతున్నాడు. మే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతోంది ఎస్విసి సంస్థ. ఈ మేరకు దిల్ రాజు బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ బాలీవుడ్ పింక్ రీమేక్ కమర్షియల్ గా మంచి ఫలితం అందుకుంది కానీ పవన్ రేంజ్ లో ఇంకా ఆడాల్సిందని ఫ్యాన్స్ ఫీలవుతూ ఉంటారు.
ఇక టైమింగ్ విషయానికి వస్తే మే ఒకటి నుంచి ఎన్నికల పోలింగ్ కి సరిగ్గా పన్నెండు రోజులు గ్యాప్ ఉంది. అంటే ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉంటుంది. వకీల్ సాబ్ అసలు రిలీజ్ టైంలో ఏపీలో అధికార పార్టీ ఎంతగా ఇబ్బంది పెట్టిందో అభిమానులు మర్చిపోలేదు. టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇవ్వకపోవడం, అదనపు షోలకు నో చెప్పడం తదితరాలన్నీ జరిగాయి. దీని వల్ల కొన్ని ఏరియాల్లో నష్టం కూడా వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని టిడిపి జనసేన నమ్ముతున్న టైంలో వకీల్ సాబ్ వస్తుండటంతో ఖచ్చితంగా ఆ సినిమాకు మద్దతుగా ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తుతారు.
ఇది సానుకూలంగా వసూళ్లకు పని చేస్తుంది. ఎలాగూ ఆ రోజు రిలీజులు లేవు. మూడో తేదీన నాలుగు వస్తున్నాయి కానీ ఆలోగా వకీల్ సాబ్ తనకిచ్చిన కార్యం నెరవేరుస్తాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. పబ్లిక్ మూడ్ పూర్తిగా రాజకీయాలతో నిండిన సమయంలో జనసేన అధినేత నటించిన సినిమాగా వకీల్ సాబ్ కు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. ఓటిటి, ఆన్ లైన్లో దొరికేదే అయినా థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరుగా. పైగా వ్యవస్థ మీద పవన్ ప్రశ్నలు, సెటైర్లు వకీల్ సాబ్ లో బోలెడున్నాయి. ఏ స్థాయిలో వర్కౌట్ చేస్తుందో చూడాలి.
This post was last modified on April 27, 2024 10:51 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…