ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అదే.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం కల్కి. ఈ చిత్రాన్ని మే 9నే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ కుదరలేదు.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యానికి తోడు ఎన్నికలు, ఐపీఎల్ హడావుడి కారణంగా టీం ‘కల్కి’ని వాయిదా వేసేసింది. కానీ ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొత్త డేట్ ఎంచుకున్నాక నేరుగా ఫలానా తేదీన రిలీజ్ అని ప్రకటించాలని చూస్తున్నారు.
కానీ ఆ విషయంలో ఎంతకీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది టీం. ఐతే అనేక తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు టీం విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించబోతున్నారు. శనివారం నాటి అప్‌డేట్ గురించి ముందు రోజు ప్రకటన చేసింది కల్కి టీం. సమయం ఆసన్నమైంది అంటూ ఊరించింది టీం. ఐతే ఈ అప్‌డేట్ రిలీజ్ డేట్ గురించే అని సమాచారం. విస్తృత చర్చల తర్వాత జూన్ 27వ తేదీని విడుదల తేదీగా ఎంచుకుందట కల్కి టీం. ఈ మేరకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇచ్చేశారట. వాళ్లు మే చివరిలోనే సినిమాను రిలీజ్ చేయాలని అన్నా.. అప్పటికి సినిమాను సిద్ధం చేయడం కష్టమని భావించి జూన్ నెలాఖరుకు రిలీజ్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ విషయాన్నే ఒక మంచి పోస్టర్ ద్వారా వెల్లడించబోతున్నారట. కల్కి సినిమా విడుదల ఖరారైతే దాన్ని బట్టి వివిధ భాషల్లో వేరే సినిమాలను షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో సోలోగానే కల్కి రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
This post was last modified on April 27, 2024 8:18 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…