ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతో ఊహించుకున్నారు కానీ.. థియేటర్లలో వారికి దిమ్మదిరిగే బొమ్మ కనిపించింది.
ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్టని.. కుటుంబ ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కుతోందని చిత్ర బృందం ప్రచారం చేసుకుంది కానీ.. రెండోరోజే బాక్సాఫీస్ దగ్గర క్రాష్ అయిన ఈ చిత్రం డిజాస్టర్‌గా తేలింది. తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. సినిమా రిలీజ్ టైంలో ఫ్యామిలీ స్టార్ మీద సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీని మీద విజయ్ అభిమానులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్‌గా రిలీజైంది. ఈ సినిమా ఆన్ లైన్లోకి రావడం ఆలస్యం ఇంకో రౌండ్ ట్రోలింగ్ మొదలైంది. సినిమాలోనే అనేక సన్నివేశాలపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రవిబాబుకు విజయ్ వార్నింగ్ ఇచ్చే సీన్లో డైలాగులు.. ఆ సన్నివేశం నడిచే తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. విలన్‌కు బుద్ధి చెప్పబోయి హీరోనే చీప్ కామెంట్లు చేయడాన్ని తప్పుబడుతున్నారు.
అలాగే యుఎస్‌లో హీరో డబ్బు కోసం మేల్ ప్రాస్టిట్యూట్‌గా మారే సీన్ మీద కూడా విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఎక్కువగా దర్శకుడు పరశురామ్ ట్రోలర్లకు టార్గెట్‌గా మారుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్‌పై ఓటీటీ ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో టీం తెలుసుకోకుండా ఉంటేనే మంచిదేమో అనిపిస్తోంది.
This post was last modified on April 27, 2024 8:17 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…