ఒక హీరోయిన్ ముందు ఒకరితో రిలేషన్‌షిప్‌లోకి వెళ్లడం.. ఆ తర్వాత అతణ్నుంచి విడిపోయి కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను వెతుక్కోవడం.. మళ్లీ బ్రేకప్ కావడం.. ఇలాంటి వ్యవహారాలు బాలీవుడ్లో కామన్. ఈ కల్చర్ దక్షిణాదిన తక్కువే. ఐతే కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ లాంటి కొద్దిమంది హీరోయిన్ల విషయంలో ఈ ట్రెండును ఇక్కడ కూడా చూస్తున్నాం.
ఆమె గతంలో మైకేల్ అనే లండన్ కుర్రాడితో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతను చెన్నైకి కూడా వచ్చి కమల్ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయి ఇక్కడి సంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపించాడు. కానీ తర్వాత ఇద్దరికీ ఏమైందో ఏమో.. శ్రుతికి అతను దూరం అయిపోయాడు. కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న శ్రుతి.. తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో ప్రేమలో పడింది.
తన కొత్త రిలేషన్‌షిప్‌ను శ్రుతి ఏమీ దాచిపెట్టలేదు. రిలేషన్‌షిప్ మొదలు కాగానే ఓపెన్‌గానే అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కొన్నేళ్లు ఇద్దరూ సంతోషంగానే కనిపించారు. కానీ ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ కూడా బ్రేక్ అయినట్లు తెలుస్తోంది.
కొన్ని నెలలుగా శ్రుతి.. శాంతను ఊసు ఎత్తట్లేదు. సోషల్ మీడియాలో అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు అన్నీ డెలీట్ చేసింది. అతణ్ని అన్ ఫాలో చేసింది. కొంత కాలంగా ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం లేదు.
పూర్తిగా కెరీర్ మీద ఫోకస్ పెట్టిన శ్రుతి.. శాంతనుకు గుడ్‌బై చెప్పేసినట్లు తెలుస్తోంది. శాంతనుతో కలిసి ఉన్న ఫ్లాట్ నుంచి ఆమె బయటికి వచ్చి వేరే చోట అద్దెకు ఉంటోందని.. శ్రుతి ఇప్పుడు మళ్లీ సింగిల్ అయిపోయిందని.. ప్రస్తుతానికి ఆమె ప్రేమ అంతా సినిమాలతోనే అని సన్నిహితులు అంటున్నారు.
This post was last modified on April 27, 2024 8:15 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్‌పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…