జనాలు ఎంత సినిమాల కరువులో ఉన్నారో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదేమో. ఇటీవలే తమిళంలో గిల్లి రీ రిలీజైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఒక్కడుకి ఇది అఫీషియల్ రీమేక్. వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. బోలెడు సార్లు టీవీలో వచ్చింది. యూట్యూబ్, ఓటిటి రకరకాల మార్గాల్లో అందుబాటులో ఉంది. అయినా సరే ఇన్నేళ్ల తర్వాత బిగ్ స్క్రీన్ మీద దీన్ని చూసే అవకాశం దక్కడంతో యూత్ చూసేయాలని డిసైడయ్యారు. దీంతో ఎగబడి బుకింగ్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. దానికి తోడు టికెట్ రేట్లు అందుబాటు ధరల్లో ఉంచడంతో సీన్ మారిపోయింది.
బుక్ మై షోలో ఏప్రిల్ 15 నుంచి 25 దాకా మొత్తం పది రోజులకు గాను 3 లక్షల 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రాస్ 12 కోట్లు దాటేసింది. ఇప్పటిదాకా ఇండియా వైడ్ రీ రిలీజుల్లో ఇదే టాప్ రికార్డు. అలా అని ఇప్పుడేం నెమ్మదించలేదు. రోజు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల ఆన్ లైన్ టికెట్లు బుక్ అవుతూనే ఉన్నాయి. నేరుగా థియేటర్ దగ్గరకు వెళ్లి కొనేవాళ్ళ సంఖ్య వేరు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. కొత్త రిలీజులన్నీ ఖాళీ సీట్లతో వెక్కిరిస్తుంటే గిల్లి మాత్రం ఇంత అరాచరం చేయడం విశేషం.
దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఆనందం తట్టుకోలేక నిర్మాత ఏఎం రత్నం వెంటనే విజయ్ షూటింగ్ స్పాట్ కు వెళ్ళిపోయి శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు డిమాండ్ గమనించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నిన్నటి నుంచి రెండు షోలు వస్తే దాదాపు ఫుల్ కావడం గమనార్హం. ఒక్కడుని మ్యాచ్ చేసే రేంజ్ లో గిల్లి లేకపోయినా విజయ్ ఇమేజ్, త్రిష గ్లామర్, విద్యాసాగర్ సంగీతం, చెల్లం అంటూ ప్రకాష్ రాజ్ విలనీ ఇలా ఎన్నో అంశాలు దీన్నో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా మార్చాయి. మొన్న సంవత్సరం మన దగ్గర పోకిరి, ఖుషి, ఒక్కడులో భారీ వసూళ్లు నమోదు చేయడం చూశాంగా.
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…