వరసగా సినిమాలు చేసి నెలకో రిలీజ్ చూసిన హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం విరామంలో ఉంది. ఎంబిబిఎస్ పరీక్షల కోసం కెరీర్ బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడికి తమిళంలో విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ వచ్చిందనే వార్త నిన్నటి నుంచి తెగ తిరుగుతోంది. ఇంకా ఒప్పుకోలేదట కానీ సానుకూలంగా ఉన్నట్టు చెన్నై కథనాలు వస్తున్నాయి. వినడానికి బాగానే ఉంది కానీ నిజానికి డెబ్యూకి ఇలాంటివి ఎంచుకోవడం కరెక్ట్ కాదు. విజయ్ కున్న క్రేజ్ దృష్ట్యా అతని సరసన నటిస్తే గుర్తింపు వస్తుంది కానీ అది జోడిగా అయితేనే ఎక్కువ సాధ్యమనే వాస్తవం మర్చిపోకూడదు.
గోట్ లో మెయిన్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఫోకస్ ఎక్కువగా తన మీదే ఉంటుంది. అలాంటప్పుడు శ్రీలీల ఒక పాట చేసినా, కొన్ని సీన్లలో నటించినా పెద్దగా ప్రయోజనం ఉంటుందని అనుకోలేం. సో తుది నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాల్సిందే. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీలో తను ఓకే అయ్యిందనే టాక్ నాలుగు రోజుల క్రితమే వచ్చింది. పాత్ర తాలూకు తీరుతెన్నులు ఇంకా బయటికి చెప్పలేదు కానీ అధికారిక ప్రకటన వచ్చే దాకా ఖచ్చితంగా చెప్పలేం. ఏ కోణంలో చూసినా శ్రీలీల క్రమంగా కోలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సీరియస్ గా ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక్కడేమో వరస ఫ్లాపులతో మార్కెట్ కొంచెం డీలా పడింది. గత ఏడాది మూడు డిజాస్టర్లు పడగా గుంటూరు కారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది కానీ అది కూడా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. శ్రీలీల డాన్సులకైతే మంచి పేరే వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు అది చూసి విజయ్ పక్కన చేయిస్తే బాగుంటుందనే ఆలోచనతో ప్రపోజల్ పంపించారట. నితిన్ రాబిన్ హుడ్ వదులుకుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఎన్నికలు అయ్యాక పాల్గొనాల్సి ఉంటుంది. ఇవి కాకుండా శ్రీలీలతో ఓకే చేయించుకున్న దర్శక నిర్మాతలు ప్రస్తుతానికి లేరు.
This post was last modified on April 26, 2024 11:16 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…