సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద రీతిలో మృతి చెందినప్పటి నుంచి బాలవుడ్లో చెడు పోకడల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అక్కడి బడా బాబులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడంతా వారసులదే హవా అని, కొత్త టాలెంట్‌ను ఎదగనివ్వరని.. ఈ బ్యాచ్ అంతా ఒక మాఫియాలా తయారైందని కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఆరోపిస్తున్నారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి కూడా అనేక విషయాలు బయటికి వచ్చాయి.
ఆ పరిశ్రమలో మాదక ద్రవ్యాలు తీసుకునే ప్రముఖులు చాలామందే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మూడు నెలలుగా చెడు కారణాలతోనే బాలీవుడ్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, నటుడు రవికిషన్.. ఈ అంశాన్ని లేవనెత్తాడు. బాలీవుడ్లో చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారని, విచారణ జరిపితే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయనన్నారు.
ఐతే అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి నటి అయిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అండగా నిలిచే సినీ పరిశ్రమ మీద ఈ అభాండాలేంటని ఆమె ప్రశ్నించారు. ఎవరో కొందరు తప్పు చేస్తే అందరికీ ఆపాదిస్తారా అని ఆమె మండిపడ్డారు. ఈ ప్రసంగం మీద పెద్ద చర్చే నడుస్తోంది నిన్నట్నుంచి. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది.
కంగనా రనౌత్ లాంటి వాళ్లు జయను తీవ్రంగా తప్పుబడితే.. పలువురు సినీ ప్రముఖులు జయను కొనియాడారు. ఐతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకే చెందిన ఎంపీ హేమమాలిని ఆ పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడింది. తమ పార్టీకి చెందిన రవికిషన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. జయకు మద్దతుగా నిలిచింది. తనకు పేరు, డబ్బు, గౌరవం అన్నీ సినిమా పరిశ్రమే ఇచ్చిందని.. అలాంటి పరిశ్రమ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే తాను తట్టుకోలేనని.. జయ వ్యాఖ్యలకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆమె అంది. బాలీవుడ్ ప్రతిష్టను ఊరికే మసకబార్చే ప్రయత్నం చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది.
This post was last modified on September 18, 2020 10:52 am
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…