నిన్న విడుదలైన పుష్ప 2 ప్రోమో టైటిల్ సాంగ్ మీద సోషల్ మీడియాలో పాజిటివ్ కన్నా నెగటివ్ రెస్పాన్స్ ఎక్కువగా కనిపించడం మ్యూజిక్ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి ఆ వీడియోలో ఉన్నది కేవలం ఇరవై సెకండ్లే. అది కూడా వరసగా పుష్ప పుష్ప అంటూ కోరస్ లో సింగర్స్ పాడటం తప్ప ఇంకేం లేదు. సాధారణంగా దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ స్లో పాయిజన్ లా ఉంటాయి. గత ఏడాది వాల్తేరు వీరయ్య టైంలో వేరీజ్ ది పార్టీ మీద ఇంత కన్నా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కట్ చేస్తే రిలీజయ్యే లోపు ఆల్బమ్ మొత్తానికే కాదు సినిమా హైలైట్స్ లోనూ ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2కి అదే రిపీట్ అవుతుందనేది దేవి అభిమానుల వెర్షన్. ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. ఊ అంటావా ఊహూ అంటావా రిలీజైన టైంలోనూ ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున డిబేట్లు జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ కు ఇదంతా అలవాటైన వ్యవహారం. ఒకవేళ పూర్తి లిరికల్ సాంగ్ విన్నాక అప్పుడు ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేయొచ్చు కానీ అసలు పాట మొదటి లైన్ కూడా బయటికి రాకూండానే ఇంతగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటనేది ఫ్యాన్స్ ప్రశ్న. రకరకాల వీడియోలు, మీమ్స్ ఇప్పటికీ ఆన్ లైన్ లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
మే 1 రాబోతున్న పుష్ప 2 టైటిల్ సాంగ్ కు వచ్చే అసలు స్పందన సినిమా బజ్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించనుంది. దేవి మీద మాములు అంచనాలు లేవు. పుష్ప 1ని మించిన అవుట్ ఫుట్ ఇచ్చాడనే టాక్ యూనిట్ నుంచి వినిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో మాస్ కి ఎంత బాగా నచ్చుతాయనే దాని మీదే హైప్ ఆధారపడి ఉంటుంది. పైగా ఈసారి నార్త్ ఆడియన్స్ కూడా విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ అంచనాలను నిలబెట్టుకోవడం కూడా కీలకం. మొత్తం అయిదు పాటలు ఉండొచ్చని తెలిసింది. అన్ని భాషల్లోనూ ఒకేసారి పుష్ప పుష్ప పాట రాబోతోంది.
This post was last modified on April 25, 2024 11:22 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…