2024లో మలయాళ ఫిలిం ఇండస్ట్రీ డ్రీమ్ రన్ కొనసాగుతోంది. వేరే ఇండస్ట్రీలు సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న టైంలో ఆ ఇండస్ట్రీ నుంచి వరుసగా బ్లాక్‌బస్టర్లు వస్తున్నాయి. సంక్రాంతికి ‘అబ్రహాం ఓజ్లర్’తో మొదలైన బ్లాక్‌బస్టర్ స్ట్రీక్ ఇప్పటికీ కొనసాగుతోంది. అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో అన్వేషిప్పిన్ కండేదుం, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్ ఘనవిజయాలు సాధించాయి. గత నెలలో వచ్చిన ‘ది గోట్ లైఫ్’ కూడా బాగా ఆడింది.
ఈ నెలలో ఫాహద్ ఫాజిల్ సినిమా ‘ఆవేశం’ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో పాటుగా విడుదలైన నివిన్ పౌలీ సినిమా కూడా బాగా ఆడుతున్నప్పటికీ.. ఆవేశం దూకుడు మామూలుగా లేదు. ఇండియా మొత్తంలో ఈ నెలలో ఇదే హైయెస్ట్ గ్రాసర్ కావడం విశేషం.
ఫాహద్ ఫాజిల్‌కు గొప్ప నటుడిగా పేరుంది కానీ.. అతను క్రౌడ్ పుల్లర్ కాదు. మాస్‌లో ఫాలోయింగ్ తక్కువే. కానీ ‘ఆవేశం’ మాత్రం జనాలను థియేటర్లకు బాగా రప్పించింది. ఈ సినిమాలో ఫాహద్ నటుడిగా విశ్వరూపం చూపిస్తూనే మాస్ హీరోయిజాన్ని కూడా పండించాడు. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఏప్రిల్ 11న రిలీజైన ఈ చిత్రం అప్పుడే వంద కోట్ల మార్కును కూడా దాటేసింది.
ఈ ఏడాది మాలీవుడ్ నుంచి వచ్చిన నాలుగో వంద కోట్ల సినిమా ఇది. సోలో హీరోగా ఫాహద్‌కు ఇదే తొలి వంద కోట్ల సినిమా కావడం విశేషం. ‘పుష్ప’ సినిమాలో షెకావత్ సార్‌తో మన ప్రేక్షకులకు బాగా చేరువ కావడంతో ‘ఆవేశం’ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఆవేశం’ను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on April 24, 2024 3:09 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…