Movie News

బాలీవుడ్ బాటలో తెలుగు దర్శకులు

హీరోలకే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కోసం హిందీ సినిమాలు చేయాలనే తాపత్రయం దర్శకులకూ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగాకు యానిమల్ ఛాన్స్ వచ్చిందంటే దానికి కారణం అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చేయడమే. ఇదే బాటలో గౌతమ్ తిన్ననూరి జెర్సీని ట్రై చేశాడు కానీ చేదు ఫలితం దక్కింది. శైలేష్ కొలను హిట్ ది ఫస్ట్ కేస్ ని నార్త్ ఆడియన్స్ కి పరిచయం చేయబోయి చేతులు కాల్చుకున్నాడు. బేబీ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన సాయి రాజేష్ కొత్త కథలు పక్కనపెట్టి హిందీ రీమేక్ పనుల్లో బిజీ అయ్యాడు. ఇంకో సంవత్సరం దాకా దానికి బ్లాక్ అయినట్టే.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజతో ఓ మూవీ ప్లాన్ చేసుకున్న గోపీచంద్ మలినేని బడ్జెట్ ఇష్యూస్ వల్ల హీరోని మార్చుకోవాల్సి వచ్చింది. ఇదే సంస్థలో సన్నీ డియోల్ తో చేయడం ఓకే అయ్యింది కానీ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. తాజాగా వంశీ పైడిపల్లి హీరో షాహిద్ కపూర్ కు ఒక లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడనే టాక్ గట్టిగా తిరుగుతోంది. తలపతి విజయ్ తో వారసుడు చేశాక వంశీకి టాలీవుడ్ స్టార్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో తనకు మున్నా నుంచి చేయూతనిస్తూనే ఉన్న దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్టు సెట్ చేసుకున్నట్టు అప్ డేట్. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒకప్పుడేమో కానీ ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్యాన్ ఇండియాని దాటిపోయాక మన టాలెంట్ కి బాలీవుడ్ ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం పడట లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ తదితరులు బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లను తీసి కేవలం డబ్బింగులుతో తమ ముద్రని ఉత్తరాది ప్రేక్షకుల్లో బలంగా వేయగలిగారు. కాకపోతే ఇక్కడ హీరోలు ఖాళీగా లేక టైం వృథా అవుతుందనుకునే డైరెక్టర్లు మాత్రం అటువైపు షిఫ్ట్ అయిపోతున్నారు. అటు కోలీవుడ్ లోనూ అట్లీ, మురుగదాస్ లాంటి వాళ్ళు సైతం ముంబైలోనే సెటిలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

This post was last modified on April 24, 2024 12:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌న్న‌త‌ల్లిని మోసం చేసిన జ‌గ‌న్‌..: ష‌ర్మిల‌

క‌న్న‌త‌ల్లిని మోసం చేసిన రాజ‌కీయ నాయ‌కుడిగా జ‌గ‌న్ కొత్త చ‌రిత్ర సృష్టించార‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌, జ‌గ‌న్ సోద‌రి…

39 minutes ago

‘హెచ్‌సీయూ’ భూ వివాదం.. ఎవ‌రికోసం?

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎక‌రాల భూముల విష‌యంపై తీవ్ర వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై…

2 hours ago

ప‌ని మొదలు పెట్టిన నాగ‌బాబు..

జ‌న‌సేన నాయ‌కుడు.. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజ‌యం ద‌క్కించుకున్న కొణిద‌ల నాగ‌బాబు.. రంగంలోకి…

2 hours ago

అమ‌రావ‌తికి ‘స్టార్’ ఇమేజ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ధి పొందిన స్టార్ హోట‌ళ్ల దిగ్గజ సంస్థ‌లు.. అమ‌రావ‌తిలో…

3 hours ago

‘ఎక్స్’ను ఊపేస్తున్న పికిల్స్ గొడవ

అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన…

3 hours ago

ష‌ర్మిల – మెడిక‌ల్ లీవు రాజ‌కీయాలు ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో…

4 hours ago