బాలీవుడ్ కొత్త ఏడాదిలో ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తుస్సుమనిపిస్తున్నాయి. వేసవిలో బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తాయనుకున్న బడేమియా చోటేమియా, మైదాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ‘బడేమియా చోటేమియా’కు డిజాస్టర్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ లేవు. కానీ ‘మైదాన్’కు మంచి టాక్ ఉన్నా వసూళ్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
మరోవైపు వేరే బాలీవుడ్ స్టార్ల కొత్త సినిమాల మీద కూడా బాలీవుడ్‌కు పెద్దగా ఆశల్లేవు. గత ఏడాది మూడు చిత్రాలతో పలకరించిన షారుఖ్ ఖాన్ నుంచి ఈ ఏడాది కొత్త చిత్రం రిలీజయ్యేలా లేదు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ల సినిమాలూ ఈ ఏడాది రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. మిగతా స్టార్ల మీద ఆశలు అంతంతమాత్రమే.
ఈ నేపథ్యంలో నార్త్ బాక్సాఫీస్ ఆశలు సౌత్ సినిమాల మీదే నిలిచి ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వచ్చే దక్షిణాది చిత్రాలే తమ బాక్సాఫీస్‌ను పోషిస్తాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆశతో ఉన్నారు. ఇక ముందు రాబోయే చిత్రాల్లో వారి తొలి ఆశ ప్రభాస్ మూవీ ‘కల్కి’నే. ఆ చిత్రం జూన్ నెలాఖర్లో వస్తుందంటున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో విడుదల కానుంది. నార్త్‌లో టాప్ బాలీవుడ్ స్టార్ల సినిమాల స్థాయిలో అది రిలీజవుతుంది.
ఇక ఆగస్టులో విడుదల కానున్న ‘పుష్ప-2’ మీద హిందీలో ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇంకా రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్ మూవీ ‘దేవర’, సూర్య చిత్రం ‘కంగువ’ మీద కూడా నార్త్ ఇండియాలో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయార్ధంలో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను సౌత్ సినిమాలే బతికించేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on April 24, 2024 5:57 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…