మొన్నటిదాకా వరస సినిమాలు, నెలకో రిలీజుతో పలకరించిన శ్రీలీల బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువు మీద దృష్టి పెట్టడంతో పాటు ఫ్రీ టైంలో బయట ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇదిలా ఉండగా అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో తను ఎంపికయ్యిందనే వార్త నిన్నటి నుంచి తెగ హల్చల్ చేస్తోంది. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికార ధృవీకరణ లేదు కానీ ప్రచారమైతే జోరుగా ఉంది. నిజానికి అజిత్ సరసన జోడిగా చేస్తోందా లేక ఇంకేదైనా ట్విస్టు ఉందా అనే ప్రశ్నలకు సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన లీకులు అంతర్గతంగా వినిపిస్తున్నాయి.
అజిత్ సాధారణంగా చిన్న వయసు అమ్మాయిలను హీరోయిన్ గా ఒప్పుకోడు. దానికి గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా మినహాయింపు కాదు. గత కొన్నేళ్లుగా ఏజ్ దాచుకోకుండా తెల్ల గడ్డంతో తనకు సూటయ్యే పాత్రలు మాత్రమే చేస్తున్న అజిత్ ఇప్పుడు శ్రీలీల ఓకే అన్నా కూడా ఆమెతో ఆడిపాడే సీన్లు, పాటలు ఉండకపోవచ్చట. భగవంత్ కేసరి తరహాలో కథలో కీలకంగా ఉంటూనే గ్లామర్ టచ్ లేకుండా పెర్ఫార్మన్స్ పరంగా ప్రాధాన్యం దక్కేలా దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ డిజైన్ చేసినట్టుగా వినికిడి. ఇది నిజమైతే మాత్రం శ్రీలీలకు కోలీవుడ్ లో మంచి ఎంట్రీ దొరికినట్టే.
ఇంకో విషయం ఏంటంటే నితిన్ రాబిన్ హుడ్ కోసం శ్రీలీలకు గతంలో మైత్రి సంస్థ కొంత అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ఏవో కారణాల వల్ల తను తప్పుకోవాల్సి వచ్చింది. దాన్ని తిరిగి వాపస్ తీసుకోకుండా తామే నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీని ఆఫర్ చేసినట్టు సమాచారం. శ్రీలీల ఎస్ చెప్పింది లేనిది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇప్పుడు శ్రీలీల చేతిలో అఫీషియల్ గా పెండింగ్ ఉన్న కమిట్ మెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. ఎన్నికలు పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడనే దాన్ని బట్టి ఈమె కాల్ షీట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇవి కాకుండా ఇంకే ప్రాజెక్ట్స్ శ్రీలీల ఓకే చేయలేదు.
This post was last modified on April 23, 2024 3:05 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…