నిర్మాతల కుటుంబం నుంచి వచ్చినా మంచి స్టార్ గా ఆశిష్ ని తీర్చిదిద్దాలనేది దిల్ రాజు పెట్టుకున్న గోల్. దానికోసం ఎంత ఖర్చయినా వెనుకాడటం లేదు. డెబ్యూ మూవీ రౌడీ బాయ్స్ ని ఎంత భారీ బడ్జెట్ తో తీశారో గుర్తున్న విషయమే. అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా ఒప్పించడం, దేవిశ్రీప్రసాద్ తో సంగీతం ఇప్పించడం, వీళ్లిద్దరితో పాటు భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి టీమ్ ని సెట్ చేసుకోవడం ఇలా చాలానే చేశారు. కానీ కాలేజీ బ్యాచుల మధ్య పాత ప్రేమదేశం ఫార్ములాని వాడిన దర్శకుడు హర్ష కొనుగంటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే దిల్ రాజు మరోసారి ప్రేక్షకులకు ఆశిష్ ని గుర్తు చేద్దామనే ఉద్దేశంతో రౌడీ బాయ్స్ ని ఎల్లుండి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసి షాక్ తిన్న వాళ్ళే ఎక్కువ. పెద్దగా ఆడని సినిమాను ఇప్పుడెందుకు తెస్తున్నారని. ఇక్కడో వ్యూహం ఉంది. రౌడీ బాయ్స్ ని ఎంపిక చేసిన ఎస్వివి మల్టీప్లెక్సుల్లో కేవలం 50 రూపాయల టికెట్ తో చూపించబోతున్నారు. మంచి లగ్జరి అనుభూతిని ఇంత తక్కువ ధరంటే యూత్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీని వల్ల కలెక్షన్లు రాకపోయినా జనం నిండిన థియేటర్లలో ఆశిష్ ని మరోసారి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయొచ్చు. ప్రస్తావించాల్సిన ఇంకో పాయింట్ ఉంది.
అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఆశిష్ రెండో మూవీ లవ్ మీ ఇఫ్ యు డేర్ 25న రిలీజయ్యేది. కానీ ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ తో పాటు ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకు వాయిదా వేశారు దిల్ రాజు. నిజానికి దీని కన్నా ముందు ప్రారంభమైన సెల్ఫిష్ కు సుకుమార్ పర్యవేక్షణ ఉన్నా అవుట్ ఫుట్ సరిగా రావడం లేదనే కారణంతో పెండింగ్ లో ఉంచిన దిల్ రాజు లవ్ మీ కోసం కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే ఆశిష్ కెరీర్ కోసం ఆయన ఎంతగా తపించిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ లా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఇదంతా.
This post was last modified on April 23, 2024 2:40 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…