దక్షిణాది సినిమా ఎవర్ గ్రీన్ జంటల్లో సూర్య-జ్యోతికలది ఒకటి. వీళ్లిద్దరూ కలిసి కాక్క కాక్క, సిల్లను ఒరు కాదల్ సహా ఏడు సినిమాల్లో కలిసి నటించడం విశేషం. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అన్యోన్యంగా సాగుతోంది వీరి వైవాహిక జీవితం. మధ్యలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని.. ఇద్దరూ విడిపోతున్నారని కొన్ని ప్రచారాలు జరిగాయి. అవేవీ నిజం కాదని తేలింది.
వివాహం తర్వాత పదేళ్లకు పైగా కుటుంబ జీవితానికే పరిమితం అయిన జ్యోతిక మళ్లీ సూర్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆయన నిర్మాణంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఇప్పుడు వేర్వేరు చిత్రాలతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ సూర్యతో కూడా కలిసి నటించబోతోందట జ్యోతిక.
బెంగళూరు డేస్ లాంటి క్లాసిక్ తీసిన అంజలి దర్శకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి నటించబోెతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. బహు భాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో మరి కొందరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. సూర్య, జ్యోతిక కలిసి చివరగా ‘సిల్లను ఒరు కాదల్’ (తెలుగులో నువ్వు నేను ప్రేమ) చిత్రంలో నటించారు. ఆ సమయానికే వీళ్లిద్దరికీ పెళ్లయిపోయింది. తర్వాత కలిసి నటించలేదు.
సూర్య ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కంగువ’ షూట్ చివరి దశలో ఉంది. అది అక్టోబరులో విడుదలవుతుంది. ఇటీవలే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా అనౌన్స్ అయింది. దీంతో పాటు వెట్రిమారన్, సుధ కొంగర చిత్రాల్లోనూ సూర్య నటించాల్సి ఉంది.
This post was last modified on April 22, 2024 2:21 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…