ఇస్మార్ట్ శంకర్ డబుల్ సమస్యలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ విడుదల జూన్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ టీమ్ వరస చూస్తుంటే అదంత సులభంగా అనిపించడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సినిమా షూటింగ్ ముప్పాతిక శాతం పూర్తయ్యింది. ఇంకో రెండు మూడు పాటలు బాలన్స్ ఉన్నాయి. మణిశర్మ ఇస్తున్న ట్యూన్ల నుంచి బెస్ట్ రాబట్టుకోవాలని చూస్తున్న పూరి ఆ కారణంగానే రికార్డింగ్ లేట్ చేస్తున్నారని వినికిడి. మొదటి భాగానికి మించి అదిరిపోయే పాటలు సెట్ చేసుకోవాలనేది పూరి ఆలోచన.

డిజిటల్, ఓటిటి డీల్స్ పూర్తయినప్పటికీ మిగిలిన భాగం ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేకే విడుదల తేదీ నిర్ణయించలేకపోతున్నారని యూనిట్ లీక్. దానికి తోడు బడ్జెట్ పరంగా చేయి దాటిపోవడం, లైగర్ ప్రభావంతో పాటు రామ్ గత డిజాస్టర్ల ఎఫెక్ట్ వల్ల భారీ క్రేజ్ నెలకొనడం లేదు. ఇస్మార్ట్ శంకర్ బ్రాండ్ మీద బిజినెస్ ఎక్కువగా జరుగుతోంది తప్పించి హీరో దర్శకుడి కలయిక గురించి కాదు. పూరి సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ డబుల్ ఇస్మార్ట్ పనుల్లో తలమునకలై ఉన్నాడు. ఆకాష్ పూరి కోసం కథలు తెచ్చిన డైరెక్టర్లను సైతం ఈ కారణంనే కలవడం లేదట.

సో ఇదంతా తేలాలంటే కొంత టైం పట్టేలా ఉంది. అసలే జూన్ నుంచి ప్యాన్ ఇండియా సినిమాలు భారీ క్యూ కడుతున్నాయి. ఆగస్ట్ నుంచి ఇది పీక్స్ కు చేరుకోవడం ఖాయం. ఒకవేళ కల్కి 2898 ఏడి కనక జూలైకు వెళ్తే ఆ నెల మీద ఆశలు పెట్టుకోవడానికి ఉండదు. ఆపై నెల పుష్ప 2 నుంచి గేమ్ చేంజర్ దాకా ఆ తాకిడి అలా వెళ్తూనే ఉంటుంది. సో డబుల్ ఇస్మార్ట్ జూన్ కి కట్టుబడటం మంచి ఆప్షన్. కాకపోతే చేతిలో ఉన్న తక్కువ టైంలో చిత్రీకరించాల్సిన పాటలతో సహా పెండింగ్ ఉన్న టాకీ పార్ట్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో రామ్ డ్యూయల్ రోలని టాక్.