జనాలు శతదినోత్సవాలను ఎప్పుడో మర్చిపోయారు. ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజులు బలంగా ఆడితే చాలనుకునే ట్రెండ్ లో వంద రోజుల మాట కలగా మారిపోయింది. కానీ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలు ఈ ఫీట్ ని సాధిస్తూ ఉంటాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి నువ్వా నేనాని పోటీ పడుతూ వేర్వేరు సెంటర్లలో సంవత్సరం ఆడిన రికార్డుని సంపాదించాయి. నిజంగానే రోజుకు నాలుగు షోలు ఆడించే అందుకున్నారా లేక అభిమానులు ప్రెస్టీజ్ కు వెళ్లి అది వచ్చేలా చేసుకున్నారా అనేది థియేటర్ ఓనర్లకు మాత్రమే తెలుసు.
వీటి సంగతి పక్కనపెడితే తాజాగా నిన్న గుంటూరు కారం సెంచరీ కొట్టేసింది. రెండు థియేటర్లలో హండ్రెడ్ పోస్టర్ వేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని రామకృష్ణ, కర్ణాటక ముల్బాగల్ లోని నటరాజ్ లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నిజానికి గుంటూరు కరం రిలీజైన టైంలో వచ్చిన మిశ్రమ స్పందనను , హనుమాన్ పోటీని తట్టుకోలేక వెనుకబడిన వైనానికి ఇప్పుడు అందుకున్న ఘనతకు ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం మహేష్ పేరు మీద ఆయా ప్రాంతాల్లో కొన్ని మైలురాళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఫ్యాన్స్ ఆడించారని ఇతర హీరోల అభిమానుల కామెంట్.
ఏది నిజమో ఏది అబద్దమో తేల్చి చెప్పలేం కానీ ఏదైతేనేం అంతగా ఆడలేదనుకున్న గుంటూరు కారం పేరు మీద వంద రోజుల స్టాంప్ పడటం సంతోషకరమే. నెట్ ఫ్లిక్స్ లో సినిమా, యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి పాట, ఇటీవలే శాటిలైట్ ఛానల్ లో జరిగిన ప్రీమియర్ వీటన్నింటిలో రెస్పాన్స్ గమనిస్తే మహేష్ బాబు బ్రాండ్ ఎంత బలంగా పని చేసిందో అర్థమవుతుంది. కొంచెం అటుఇటుగా ఉందని తెలిసినా కూడా ఒక్కసారైనా ఖచ్చితంగా చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడటం రేంజ్ ని సూచిస్తోంది. ఒకవేళ త్రివిక్రమ్ శ్రీనివాస్ కనక పూర్తి అంచనాలు అందుకుని ఉంటే అరాచకం నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.
This post was last modified on April 21, 2024 6:46 am
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…