Movie News

జెర్సీ అభిమాన వర్షంలో తడిసిన నాని

నిన్న అయిదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెర్సీ రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కు నాని కుటుంబ సమేతంగా విచ్చేశాడు. రావడంలో పెద్ద విశేషం లేదు కానీ అక్కడికి వచ్చిన అభిమాన జన సందోహం, కొడుకు సంభ్రమాశ్చర్యాలతో అంతా చూస్తుండగా నాని మురిసిపోతున్న క్షణాలు, హాలు లోపల న్యాచురల్ స్టార్ కు స్వాగతం చెబుతూ ఫ్యాన్స్ చేసిన సందడి ఒకటా రెండా మర్చిపోలేని జ్ఞాపకాల వర్షంలో నాని తడిసి ముద్దయిపోయాడు. నిజానికి ఇంత రెస్పాన్స్ ఊహించలేదని నానితో పాటు వచ్చిన ఇతర టీమ్ సభ్యుల మాట.

వాస్తవానికి రీ రిలీజులు కమర్షియల్ సినిమాలకు మాత్రమే వర్కౌట్ అవుతాయి. అవి కూడా టైర్ 1 హీరోలు చేసినవే ఎక్కువ. కానీ జెర్సీ అలా కాదు. ఒక క్రికెటర్ జీవితంలో జరిగిన విషాదానికి సాక్షి. ఆటలో గెలిచి వ్యాధితో పోరాడలేక ఒదిగిపోయిన ఒక విజేత కథ. విపరీతమైన భావోద్వేగాలు, కోపాలు తాపాలు, సెంటిమెంట్ ఉంటాయి. అయినా సరే ఆడియన్స్ కి నచ్చేసింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రతి ఒక్కరిని తాకేలా తెరకెక్కించిన విధానం హత్తుకునేలా చేసింది. కొడుకు సెంటిమెంట్ పండించిన తీరు ఫ్యామిలీ ఆడియన్స్ ని చేరువ చేసింది. వందల కోట్లు రాకపోయినా ప్రత్యేకంగా నిలిచింది.

ఒకరకంగా చెప్పాలంటే జెర్సికి వచ్చిన స్పందన చూస్తే నిజంగా నాని ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. ఫార్ములాకు కట్టుబడకుండా క్లాసు మాస్ రెండూ బాలన్స్ అయ్యేలా కథలు ఎంచుకుంటున్న తీరు ఫాలోయింగ్ ని పెంచుతోంది. దసరా తర్వాత హాయ్ నాన్న చేయడమే దానికి నిదర్శనం. హిందీలో ఇదే జెర్సిని ఇదే దర్శకుడు షాహిద్ కపూర్ తో తీస్తే ఆడలేదు. నాని స్టామినాకి ఇదో ఉదాహరణ. ప్రస్తుతం సరిపోదా శనివారంలో బిజీగా ఉన్న నాని తర్వాత వరసగా సుజిత్, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టులను లైన్ లో పెట్టేశాడు. ఈ ఏడాది కేవలం ఒక్క రిలీజుతోనే సర్దుకోవాల్సి వస్తోంది.

This post was last modified on April 21, 2024 6:43 am

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

4 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

5 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

6 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

7 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

11 hours ago