వేసవి అంటే సినిమాలకు బాగా కలిసొచ్చే సీజన్ అని పేరు. ఈ టైంలో క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. థియేటర్లు కళకళలాడుతుంటాయి. కానీ కొన్నేళ్లుగా వేసవి సీజన్లు టాలీవుడ్‌కు పెద్దగా కలిసి రావడం లేదు. కరోనా టైంలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. గత ఏడాది పెద్ద సినిమాలు లేక సమ్మర్ సీజన్ కళ తప్పింది. ఇప్పుడు చూస్తే 2023 వేసవే చాలా బెటర్ అనిపిస్తోంది.
ఈసారి అసలే పెద్ద సినిమాలు లేవు. పైగా ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ పీక్స్‌లో నడుస్తోంది. ఇవి చాలవన్నట్లు ఎన్నికల హడావుడి నడుస్తోంది. జనాలంతా అందులో మునిగిపోయి సినిమా ఎంటర్టైన్మెంట్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటోంది.
ఈ వారం ఏం సినిమాలు రిలీజయ్యాయో కూడా జనాలు పట్టించుకోవడం లేదు. ‘పారిజాత పర్వం’ సహా ఏవో కొన్ని చిన్నా చితకా సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో వేటికీ మినిమం ఆక్యుపెన్సీలు లేవు. ‘పారిజాత పర్వం’ మూవీకి మార్నింగ్ షోలకు థియేటర్లో పది మంది అయినా కనిపించారు కానీ.. మిగతా సినిమాలకు ఆ మాత్రం కూడా టికెట్లు తెగలేదు. ‘పారిజాత పర్వం’ పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో రెండో షోల నుంచి ఆ మాత్రం జనం కూడా లేదు. దీంతో చాలా థియేటర్లలో మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి.
ముందు వారంలో వచ్చిన సినిమాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ‘టిల్లు స్క్వేర్’, ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓ మాదిరిగా ఆడుతున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ గడ్డు పరిస్థితులు చూశాక ఒక్కొక్కటిగా సినిమాలను వాయిదా వేసేస్తున్నారు. శశివదనే, లవ్ మి లాంటి చిత్రాలు వెనక్కి వెళ్లిపోయాయి. తమిళ అనువాద చిత్రం ‘బాక్’ సైతం వాయిదా పడింది. ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు అయ్యేదాకా ఈ బాక్సాఫీస్ స్లంప్ కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on April 20, 2024 5:07 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…