మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్స్ లో విక్రమార్కుడుది ప్రత్యేక స్థానం. వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటుతున్నా చూస్తున్న ప్రతిసారి మంచి కిక్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని తెరకెక్కించిన తీరు పలు భాషల్లో రీమేక్ అయ్యేదాకా వెళ్ళింది. విక్రమార్కుడు 2 కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత కెకె రాధామోహన్ మరోసారి దీని ప్రస్తావన తెచ్చారు. హిందీలో ఆయన నిర్మాతగా వ్యవహరించిన రుస్లాన్ విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో సీక్వెల్ గురించి చెప్పుకొచ్చారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని త్వరలోనే తీస్తానని అన్నారు. దీంతో పాటు భజరంగి భాయ్ జాన్ కొనసాగింపు కూడా వేరే బ్యానర్ లో వస్తుందని స్పష్టం చేశారు. వినడానికి బాగానే ఉంది కానీ విక్రమార్కుడు 2 అంటే రవితేజతోనే తీయాలి. ఒకవేళ రాజమౌళి కాకుండా వేరెవరు తీసినా పోలికల పరంగా ఇబ్బందులు వస్తాయి. సంపత్ నంది దర్శకుడిగా తీసే ప్లాన్ ఉందని ఇన్ సైడ్ టాక్ ఉంది కానీ కార్యరూపం దాల్చే సూచనలు దగ్గరలో లేవు. సాయిదుర్గ తేజ్ గాంజా శంకర్ ఆగిపోయాక సంపత్ నంది నెక్స్ట్ ఏం చేయబోయేది కన్ఫర్మ్ కాలేదు. తను ఓదెల 2 నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాడు.
సో చెప్పుకున్నంత ఈజీగా విక్రమార్కుడు 2 తెరకెక్కడం కుదరదు. రవితేజ అంగీకారంతో పాటు దీన్ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేసే దర్శకుడిని సెట్ చేసుకోవాలి. జక్కన్న సృష్టించిన బ్రాండ్ ని అంతే బలంగా నిలబెట్టి సీక్వెల్ తీయగలిగిన వాళ్ళు కావాలి. ఇదంత సులభం కాదు. పలు ఇంటర్వ్యూలలో రవితేజ తన ఫేవరెట్ మూవీగా విక్రమార్కుడిని చెప్పుకున్నారు కానీ విక్రమ్ సింగ్ రాధోడ్ లేకుండా కేవలం అత్తిలి సత్తిబాబుతో సీరియస్ కం ఎంటర్ టైనర్ డ్రామాని సృష్టించడం సవాలే. ఇంతకీ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో ఇద్దరు రవితేజలున్నారో లేక ఒక్కరికే పరిమితం చేశారో.
This post was last modified on April 20, 2024 10:52 am
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…