Categories: Movie News

ట్విట్ట‌ర్లో ప్ర‌మాద‌క‌ర కొత్త ట్రెండ్

సోషల్ మీడియాలో ఒరిజినల్ పేరు, ఫొటో పెట్టుకుని ప్రొఫైల్స్ నడిపించేవాళ్లు ఎంతమంది ఉంటారో.. మారు పేర్లు, ఫొటోలు, బయోలతో బండి నడిపించేవాళ్లు అదే స్థాయిలో ఉంటారు. తమ ఐడెంటిటీని బయటపెట్టకపోయినా.. ఊరికే టైంపాస్ కోసం ఇక్కడ మారు పేర్లు, ఫొటోలతో ఉండేవాళ్లతో ఇబ్బందేమీ లేదు. కానీ వేరే ఉద్దేశాలతో ఫేక్ ఐడీల ద్వారా జనాలతో కనెక్టయ్యే వాళ్లతో ప్రమాదమే. సోషల్ మీడియా అంటేనే ఫేక్ వ్యవహారాలకు నెలవుగా మారిపోయిన ఈ రోజుల్లో.. ఇక్కడి జనాలతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టుకుని చురుగ్గా ఉండే అకౌంట్లలో చాలా వరకు ఫేక్‌వే ఉంటున్నాయి. ఈ అకౌంట్ల నుంచి స్వీట్‌గా మాట్లాడుతూ.. రీచార్జిలు చేయించుకునే, డబ్బులు వేయించుకునే, ఇతర సాయాలు చేయించుకునే బ్యాచ్‌లు ఇక్కడ పెద్ద ఎత్తునే ఉన్నాయి.

కేవలం అందమైన అమ్మాయి ఫొటో పెడితే సరిపోదని, స్టార్ హీరోలకు కల్ట్ ఫ్యాన్ అని చెప్పుకుని ఆ హీరోల అభిమానుల్ని ఫాలోవర్లుగా మార్చుకుని.. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి పబ్బం గడుపుకునే వాళ్లు బాగా పెరిగిపోయారు ట్విట్టర్లో. ఈ తరహాలోనే అలేఖ్య అనే అమ్మాయి పేరుతో ఉన్న ఒక అకౌంట్ తాలూకు బాగోతం తాజాగా బయటికి వచ్చింది. ఆ అకౌంట్ నడుపుతున్నది ఓ అబ్బాయి. తాను పవన్ అభిమానిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ, అందమైన అమ్మాయి ఫొటో పెట్టి కొందర్ని బుట్టలో వేసుకుని ఆ వ్యక్తి రీచార్జులు చేయించుకోవడం, అకౌంట్లలో డబ్బులు వేయించుకోవడమే కాదు.. ఒక వ్యక్తితో ఫోన్ కూడా కొనిపించుకున్నాడు.

ఐతే ఎలాగోలా ఆ ఫోన్ కొనిచ్చిన వ్యక్తే అతడి బాగోతాన్ని కనిపెట్టాడు. అతణ్ని ఎక్స్‌పోజ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. దీంతో బాధితులు ఒక్కొక్కరే బయటికి రావడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆ వ్యక్తి అకౌంట్ మూసుకుని వెళ్లిపోయాడు. ఇలా అమ్మాయిల బొమ్మలు పెట్టి, స్టార్ హీరోకు వీరాభిమానిని అని చెప్పుకుని.. ఆపై సెంటిమెంట్ స్టోరీలు చెప్పి అవసరాలు తీర్చుకునే వ్యక్తులకు కొదవే లేదు. అలాగే అమ్మాయిల ప్రొఫైల్స్‌తో ఆకర్షించి.. ఫాలోవర్లు పెరిగాక తర్వాత వాటిని ఫ్యాన్ పేజీలుగా మార్చి అమ్ముకునే వ్యక్తులూ ఉన్నారిక్కడ. ఈ నేపథ్యంలో నెటిజన్లు అప్రమత్తంగా లేకుంటే కష్టమే.

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

10 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

1 hour ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

2 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

2 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

3 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

3 hours ago