మొన్న ఏడాది ఒకే ఒక జీవితంతో మంచి హిట్టుని ఖాతాలో వేసుకున్న శర్వానంద్ త్వరలో మనమేతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చాడు. షూటింగ్ కొంత ఆలస్యమవుతూ వచ్చినప్పటికీ ఎట్టకేలకు వేసవి కానుకగా తీసుకురాబోతున్నారు. ఉప్పెన, బంగార్రాజు తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ కృతి శెట్టి మనమే మీద భారీ నమ్మకం పెట్టుకుంది. ఇవాళ టీజర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. కథను ఎక్కువగా రివీల్ చేయలేదు.
చూసేందుకు మంచివాడిలా కనిపించినా తాను మంచివాడిని కాననే నమ్మకం ఓ యువకుడిది(శర్వానంద్). సరదాగా జీవితం గడుపుతూ జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఇతని లైఫ్ లోకి ఓ అమ్మాయి(కృతి శెట్టి) వస్తుంది. పరిచయం ప్రేమగా మారే తరుణంలో ఒక బుల్లిబాబు (మాస్టర్ విక్రమ్ ఆదిత్య) ఎంట్రీ ఇస్తాడు. ఎంత అల్లరి చేస్తున్నా భరిస్తూ ఉండటం అంతు చిక్కని రహస్యంగా కనిపిస్తుంది. అసలు వాడు ఈ జంటకే పుట్టాడా లేక ఇలాంటివి అసలు సహించని కుర్రాడు ప్రియురాలితో పాటు ఆ చిన్ని డెవిల్ ని ఎందుకు భరించాడనేది తెరమీద చూడాలి. అధిక శాతం కథ ఫారిన్ లోనే జరుగుతుంది.
విజువల్స్ గట్రా చూస్తుంటే కమర్షియల్ మసాలాలు లేకుండా శ్రీరామ్ ఆదిత్య ఈసారి పూర్తిగా ఫ్యామిలీ రూటు పట్టాడు. చిన్నా పిల్లాడి సెంటిమెంట్ తో సినిమాలు కొత్తేమి కాదు కానీ ఈ మధ్య కాలంలో ఎవరూ ట్రై చేయలేదు. మిగిలిన క్యాస్టింగ్ ని రివీల్ చేయలేదు కానీ మనమేలో సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ ఇలా పెద్ద తారాగణమే ఉంది. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయకపోయినా ఖచ్చితంగా ఈ వేసవిలోనే రానుంది. ప్రభాస్ కల్కి 2898 ఏడి లాంటి ప్యాన్ ఇండియా సినిమాల తేదీలను బట్టి నిర్ణయం తీసుకోబోతున్నారు.
This post was last modified on April 19, 2024 2:03 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……