Movie News

28 రోజులకే టిల్లు స్క్వేర్ డిజిటల్

కొత్త సంవత్సరంలో హనుమాన్ తర్వాత టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న సినిమా టిల్లు స్క్వేర్. ట్రైలర్ మీద నెగటివ్ టాక్ తో మొదలై వారం రోజులకే ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద మూవీ పోటీలో ఉందని తెలిసినా బరిలో దిగి అద్భుత విజయం సాధించడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. నెల రోజుల లోపే 125 కోట్ల గ్రాస్ ని దాటేసి, కొత్త రిలీజులను కాదని మరీ జనం తన కోసమే థియేటర్లకు వచ్చేలా చేయడంలో సిద్ధూ జొన్నలగడ్డ టీమ్ సక్సెసయ్యింది. ఇంకా చాలా చోట్ల వీకెండ్స్, సెలవుల్లో టిల్లు హవానే కొనసాగుతోంది. ఆదివారం వస్తే మెయిన్ స్క్రీన్స్ లో టికెట్లు దొరకడం లేదు.

ఇంత ఊపులో ఉన్న టిల్లు స్క్వేర్ ఓటిటిలో అప్పుడే వచ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఏకకాలంలో స్టీమింగ్ చేయబోతున్నట్టు నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంటే సరిగ్గా విడుదలైన నాలుగు వారాలకు డిజిటల్ లో టిల్లు దిగుతున్నాడు. ఇది సితార సంస్థ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం. రిలీజ్ కు ముందే ఏ డేట్ కి ఇవ్వాలనే కండీషన్ అగ్రిమెంట్ లో రాసుకోవడం వల్లే ఇప్పుడు మార్చడానికి లేదు. ఒకవేళ ఈ రేంజ్ సక్సెస్ ని ఊహించి ఉంటే బహుశా వాయిదా వేసుకోమని అడిగి ఉండేవాళ్ళేమో చెప్పలేం.

ఏది ఏమైనా ఇంత పెద్ద హిట్ సినిమాలు త్వరగా డిజిటల్ లోకి వచ్చేయడంతో థియేట్రికల్ రన్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫ్లాప్ అయినవి వస్తే పెద్ద మ్యాటర్ కాదు కానీ ఇలా జనం ఆదరించినవి కూడా త్వరగా ఓటిటి బాట పట్టేయడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్మాత బిజినెస్ కోణం నుంచి ఆలోచిస్తే రిలీజ్ కు ముందే మంచి రేట్ వచ్చినప్పుడు పెట్టుబడి సేఫ్ అవ్వడం కోసం అలా చేయడం తప్పు కాదనే వాదనని కొట్టి పారేయలేం. ఇదే సితార గుంటూరు కారం సైతం 28 రోజులకే స్ట్రీమింగ్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.

This post was last modified on April 19, 2024 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 minutes ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

3 hours ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

11 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

12 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

12 hours ago