కమెడియన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు హీరోలుగా మారాక ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టం. అందుకే సునీల్, అలీలు ఎన్ని బ్లాక్ బస్టర్లు చేసినా చివరికి సేఫ్ జానర్ అయిన కామెడీకి తిరిగి వచ్చేశారు. ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు. అన్ని ఛాన్సులు దొరకాలంటే బాగా కష్టపడాలి. ప్రియదర్శి ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు. పెళ్లి చూపులుతో పరిచయమై జాతిరత్నాలుతో మంచి బ్రేక్ అందుకున్న ఈ యువ నటుడు మల్లేశం లాంటి సీరియస్ డ్రామాలో మెప్పించినప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేకపోతున్నాడు. మొన్నొచ్చిన ఓం భీం బుష్ కూడా ఓ మోస్తరుగా ఆడిందే తప్ప అద్భుతాలు చేయలేదు.
ప్రియదర్శి సోలో హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. డార్లింగ్ టైటిల్ లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు కానీ ఈ లోగా లీక్ రూపంలో వచ్చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. నభ నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ గురించి హింట్స్ ఇస్తూ గత రెండు మూడు రోజులుగా ఇద్దరూ సోషల్ మీడియాలో సరదాగా ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. మధ్యలో రీతూ వర్మ కూడా ఇన్వాల్వ్ కావడంతో ఆమె కూడా ఉందేమోననే అనుమానాలు మొదలయ్యాయి. ఏదైతేనేం కొంత అటెన్షన్ అయితే తెచ్చుకోగలిగింది.
తమిళ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న డార్లింగ్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా తీశారట. కంటెంట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని వినికిడి. అయితే ప్రియదర్శి లాంటి వాళ్లకు సోలో హీరోగా మార్కెట్ లేదు. ఓపెనింగ్స్ కూడా కష్టమే. బజ్ రావాలంటే ఏదో మేజిక్ జరిగేలా ప్రమోషన్ చేయాలి. అందుకే టీమ్ చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని పబ్లిసిటీ షురూ చేసింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించినా సరైన అవకాశాలు రాకపోవడం, కొంత అనారోగ్యం వల్ల గ్యాప్ తీసుకున్న నభా నటేష్ దీంతో పాటు నిఖిల్ స్వయంభులోనూ నటిస్తోంది. ఇవి ఎలాంటి బ్రేక్ ఇస్తాయో చూడాలి.
This post was last modified on April 19, 2024 10:29 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…