Movie News

డిజాస్టర్ స్ట్రీక్‌కు ఇప్పుడైనా తెరపడేనా?

సీనియర్ నటుడు సాయికుమార్ నట వారసుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు ఆది. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు లాంటి క్లాసిక్స్ తీసిన విజయ భాస్కర్ దర్శకత్వంలో అతను చేసిన తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’ ఉన్నంతలో బాగానే ఆడింది. ఆ తర్వాత ‘లవ్లీ’ కూడా సక్సెస్ అయింది. దీంతో ఆది హీరోగా బాగానే నిలదొక్కుకుంటాడనిపించింది. కానీ ఆ తర్వాత తన చిత్రాలేవీ సరిగా ఆడలేదు. కానీ ఆదికి అవకాశాలైతే ఆగలేదు. చాలా ఏళ్ల నుంచి వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అవి రిలీజవుతున్న సంగతి కూడా తెలియట్లేదు.

ఆల్రెడీ ఆది సినిమాల సంఖ్య దాదాపు 20కి చేరుకుంది. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలకు వెళ్లిపోతున్నాయి. కానీ ఈ మధ్య డిజిటల్ మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో ఇప్పుడు ఆది సినిమాలు ఓటీటీల్లో సేల్ కావడం కూడా కష్టమయ్యే పరిస్థితి.

ఇలాంటి టైంలో తాను చేస్తున్న మరీ చిన్న స్థాయి చిత్రాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి కాస్త పేరున్న సినిమా ఒకటి సెట్ చేసుకున్నాడు ఆది. అదే.. కృష్ణ ఫ్రమ్ బృందావనం. ఇది ‘అహ నా పెళ్లంట’, ‘పూల రంగడు’ లాంటి సూపర్ హిట్లు తీసి ఆ తర్వాత ‘భాయ్’ చిత్రంతో గాడి తప్పిన వీరభద్రం చౌదరి రూపొందించబోయే చిత్రం. ‘భాయ్’తో ఒక్కసారిగా పాతాళానికి పడ్డ వీరభద్రం.. తర్వాత పదేళ్లలో ‘వారాలబ్బాయ్’ అనే ఒకే సినిమా చేయగలిగాడు. అందులో ఆదినే హీరో. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత ఆది చేసిన చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బెటర్.

ఇప్పుడు ఈ కాంబినేషన్లో తూము నరసింహ, జామి శ్రీనివాసరావు అనే ఇద్దరు కొత్త నిర్మాతలు సినిమా చేస్తున్నారు. ‘ప్రేమకావాలి’; ‘లవ్లీ’ సినిమాల్లో ఆదికి మరపురాని పాటలు ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. గత సినిమాలతో పోలిస్తే కొంచెం ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న ఈ మూవీతో అయినా ఆది డిజాస్టర్ స్ట్రీక్ ఆగుతుందేమో చూడాలి.

This post was last modified on April 18, 2024 5:14 pm

Share

Recent Posts

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

6 minutes ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

7 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

7 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

8 hours ago

మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలకు గ్రీన్ కార్డు షాక్

అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…

8 hours ago

సేనాపతి మీద అభిమానుల భారం

ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…

9 hours ago