మాములుగా కొత్త శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్ కు అదో సంబరం. కొత్త సినిమాలు థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేయొచ్చని ఏమేం రిలీజవుతున్నాయో వెతుక్కుని మరీ చూస్తారు. కనీసం ఒకటి రెండు చెప్పుకోదగ్గవి ఉంటే ఓపెనింగ్స్ పరంగా బయ్యర్లకూ ఉపయోగపడుతుంది. కానీ రేపు ఏప్రిల్ 19 బాక్సాఫీస్ దగ్గర కౌంట్ అయితే కనిపిస్తోంది కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏ మాత్రం సందడి లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. పోనీ బజ్ చెప్పుకోదగ్గ రీతులో ఉంటే నేరుగా కౌంటర్ సేల్స్ ద్వారా జనాలు వస్తారేమోనని ఆశలు పెట్టుకోవచ్చు. కానీ అదీ కనిపించడం లేదు.
ఉన్నంతలో కాస్త జనాల దృష్టిలో ఉన్నది ‘పారిజాత పర్వం’ మాత్రమే. చైతన్య రావు, శ్రద్ధ దాస్, సునీల్ తదితర క్యాస్టింగ్ తో కిడ్నాప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మీద నమ్మకంతో టీమ్ ముందు రోజు సాయంత్రమే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తోంది. సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘టెనెంట్’ సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చూసింది కానీ బజ్ పరంగా బాగా వెనుకబడి ఉంది. మార్కెట్ మహాలక్ష్మి, మారణాయుధం, తెప్ప సముద్రం, శరపంజరం వస్తున్నాయి కానీ ఉదయం ఆటకు జనాన్ని రప్పించడం పెద్ద ఛాలెంజే. టాక్ కీలక పాత్ర పోషించనుంది.
వీటికన్నా పాత రీ రిలీజులు జెర్సి, హ్యాపీ డేస్ కు స్పందన బాగుండటం విచిత్రం. ఈ రెండు మాస్ మసాలా సినిమాలు కాకపోయినా యూత్ కి కనెక్ట్ అయినవి కావడంతో మరోసారి పెద్దతెరపై చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఫిక్స్ అయిపోవడంతో టికెట్ అమ్మకాలు బాగానే ఉన్నాయి. గత వారం రిలీజైనవన్నీ తీవ్రంగా నిరాశ పరచడంలో తిరిగి నాలుగో వారం కూడా టిల్లు స్క్వేర్ మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. బడేమియా చోటేమియా తోక ముడిచేసింది. రేపు ఏదైనా అనూహ్యంగా బాగుందనే టాక్ తెచ్చుకుంటే తప్ప సాయంత్రానికి బిసి సెంటర్లలో జనాలను చూడటం కష్టం.
This post was last modified on April 18, 2024 2:48 pm
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…
నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు…
టాలీవుడ్లో దాదాపు 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు సీనియర్ నటుడు శివాజీ. కెరీర్ ఆరంభంలో సహాయ పాత్రలు చేసిన అతను..…