సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి వయసు దాటిపోయినా.. ఇంకా ఏడడుగులు వేయని కొందరు స్టార్ హీరోలున్నారు. అందులో అందరి దృష్టీ ప్రధానంగా ప్రభాస్ మీదే ఉంటుంది. తన పెళ్లి గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అతడి పెళ్లి చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ ఆయన కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. ప్రభాస్ తీరు చూస్తుంటే ఇక పెళ్లి చేసుకోవడం అనుమానమే అనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్‌ను పెళ్లి కొడుకుగా చూడాలని ఆశపడుతున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో ఇలాగే ఎక్కువగా పెళ్లి గురించి విపరీతమైన చర్చ జరిగి ఎంతకీ వివాహం చేసుకోని హీరోల్లో విశాల్ ఒకడు. అతను గతంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ను పెళ్లాడతాడని వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. వరలక్ష్మి ఈ మధ్యే వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.
మరోవైపు విశాల్ గతంలో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. అతను ఎప్పుడు, ఎవరిని పెళ్లాడతాడో తెలియట్లేదు. తన కొత్త చిత్రం ‘రత్నం’ ప్రమోషన్ల కోసమని హైదరాబాద్ వచ్చిన అతడితో ఓ మీడియా సంస్థ జరిపిన చిట్‌చాట్‌లో భాగంగా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. దానికతను ఊహించని రీతిలో సమాధానం ఇచ్చాడు.
ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే తాను వివాహం చేసుకుంటానని అన్నాడు. నడిగర్ సంఘం కోసం భవనం కట్టించాక పెళ్లి చేసుకుంటానని, సంబంధిత కళ్యాణమండపంలో జరిగే తొలి పెళ్లి తనదే అని గతంలో చెప్పిన మాట గురించి ప్రస్తావిస్తే.. దానిపై ఎక్కువ స్పందించకుండా తాను ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక చేసుకుంటానని ఇంకోసారి నొక్కి వక్కాణిస్తూ తన పెళ్లి కార్డ్ మొదటగా ప్రభాస్‌కే ఇస్తానని చెప్పి సమాధానం దాటవేశాడు.
This post was last modified on April 18, 2024 2:33 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…