స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించేటప్పుడు వాటి మీద ఉన్న అంచనాలను మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయినా సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్స్ నుంచి వచ్చే విమర్శలు, ట్రోలింగ్ ని తట్టుకోవడం కష్టం. ఆ మధ్య గుంటూరు కారం టైంలో ఓ మై బేబీ సాంగ్ కి అభిమానులు మూకుమ్మడిగా తమన్ ని టార్గెట్ చేశారు. తిరిగి కుర్చీ మడత పెట్టి వచ్చి ఛార్ట్ బస్టర్ అయ్యాక కానీ శాంతించలేదు. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. తాజాగా ఒకప్పటి మ్యూజిక్ సెన్సేషన్ యువన్ శంకర్ రాజాకు అదే తరహా పరిస్థితి వచ్చింది.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం (గోట్) నుంచి విజిల్ పోడు లిరికల్ వీడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చినప్పటి నుంచి దీని అవుట్ ఫుట్ మీద నెటిజెన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. ఏ మాత్రం బాగాలేదని, కేవలం విజిల్ పదాన్ని పదే పదే వాడుకుని విజయ్ తో పాడించి, ఒక బ్యాడ్ ట్యూన్ తో యువన్ శంకర్ రాజా చెడగొట్టారని ఇలా రకరకాలుగా నెగటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏకంగా ఇన్స్ టా నుంచి తన అకౌంట్ ని తాత్కాలికంగా తీసేశారు. సెర్చ్ లో కొట్టినా సరే యువన్ హ్యాండిల్ ఎక్కడా కనిపించడం లేదు.
ఇది ఫ్యాన్స్ ఆన్ లైన్ ఎదురు దాడి వల్లే జరిగిందని అతని స్నేహితుల నుంచి వినిపిస్తున్న వెర్షన్. నిజమో కాదో యువన్ స్వయంగా చెప్పలేడు కానీ తర్వాత వదిలే రెండో పాట విషయంలో మాత్రం టీమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ కేవలం రెండే సినిమాలు చేయబోతున్నాడు. వాటిలో ఈ గోట్ ఒకటి. అందుకే హైప్ అంతకంతా విపరీతంగా పెరుగుతూ పోతోంది. దాంతో సహజంగానే విజిల్ పోడు ని ఎక్కువగా ఊహించుకున్నారు. సగం అందుకున్నా ఈ సమస్య వచ్చేది కాదేమో. ఇంత జరిగినా సరే మూడు రోజులకే ఆ పాట 38 మిలియన్ల వ్యూస్ దాటడం కొసమెరుపు.
This post was last modified on April 18, 2024 1:52 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…