అంచనాలకు మించి పుష్ప 2 ది రూల్ బిజినెస్ రచ్చ చేసేలా ఉంది. ఆగస్ట్ 15 విడుదలకు రెడీ అవుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ హిందీ హక్కులను అనిల్ తదాని 200 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద కొన్నాడనే వార్త ముంబై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి వాటికి ఖచ్చితమైన ఆధారాలు ఉండవు కానీ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు అంత తేలిగ్గా కొట్టిపారేసే గాసిప్ అయితే కాదనిపిస్తోంది. తమతో థియేటర్ అగ్రిమెంట్లు మొదలుపెడుతున్న అనిల్ చెబుతున్న రేట్లే దానికి సాక్ష్యమని బయ్యర్ల టాక్. ఇంత భారీ మొత్తం ఎవరూ ఊహించలేదన్నది వాస్తవం.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే కొన్ని షాకింగ్ విషయాలు అర్థం చేసుకోవచ్చు. పుష్ప 1 ది రైజ్ రిలీజ్ కు ముందు హిందీ రైట్స్ సొంతం చేసుకున్న గోల్డ్ మైన్స్ సంస్థ థియేటర్ రిలీజుకు అంతగా ఆసక్తి చూపించలేదు. తెలుగులో రన్ అయ్యాక యూట్యూబ్ ఛానల్ లో డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో మైత్రి బృందంతో పాటు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఒప్పించడంతో ఫైనల్ గా పెద్దతెరపైకి వచ్చింది. కట్ చేస్తే పుష్ప 1 కొచ్చిన అనూహ్య స్పందన చూసి కొన్నవాళ్లకు మాటలు రాలేదు. బన్నీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయారు.
అప్పుడొచ్చిన ఆ ఫలితమే పుష్ప 2ని ఇవాళ ఈ స్థాయిలో నిలిపింది. ఇంకా సరైన ప్రమోషన్ మొదలుపెట్టక పోయినా ట్రేడ్ ఎంక్వయిరీలు మాత్రం సీరియస్ గా జరుగుతున్నాయి. కెజిఎఫ్ 2, బాహుబలి రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే ధీమాలో బన్నీ అభిమానులున్నారు. ఒక తెలుగు డబ్బింగ్ మూవీకి నార్త్ లో ఇంత క్రేజ్ ఏర్పడటం అనూహ్యం. అది కూడా రాజమౌళి బ్రాండ్ లేకుండా అంటే చిన్న విషయం కాదు. ఇంకా పాటలు, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్, లిరికల్ వీడియోస్ ఇలా బోలెడు పబ్లిసిటీ పెండింగ్ ఉంది. మొదలయ్యాక హైప్ ఇంకెక్కడికి వెళ్తుందో.
This post was last modified on April 18, 2024 10:55 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…