ఇంకా చాలా దూరముంది కానీ అప్పుడే డిసెంబర్ విడుదల తేదీల కోసం పోటీ మొదలయ్యింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ని ఆ నెల 20కి లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. శ్రీరామనవమి మంచి సందర్భం కావడంతో ఆ లాంఛనం జరిగిపోయింది. అంతకన్నా ముందే వస్తుందని టాక్ ఉన్నప్పటికీ షూటింగ్ చాలా బాలన్స్ ఉండటంతో హడావిడి పడటం కన్నా స్లో అండ్ స్టడీ వైపు మొగ్గు చూపారు. రష్మిక మందన్న తప్పుకున్నాక హీరోయిన్ శ్రీలీలనే ప్రచారం తప్ప నిజంగా తనుందో లేదో క్లారిటీ ఇవ్వడం లేదు.
దీని సంగతలా ఉంచితే నాగ చైతన్య తండేల్ ని అదే డిసెంబర్ 20కి విడుదల చేసేందుకు నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీ వాస్ లు నిర్ణయించుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. నిజానికి ముందు అక్టోబర్ అనుకున్నారు. దేవరతో క్లాష్ వచ్చినా పర్వాలేదని ఆలోచించారు. కానీ అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ అవ్వదనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యారు. దీనికన్నా ఏడాది చివరి నెలే మేలని భావించి మార్చుకున్నారట. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ లో సాయిపల్లవి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సముద్రపు బ్యాక్ డ్రాప్ లాంటి ఎన్నో ఆకర్షణలు హైప్ ని పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి.
సరిగ్గా ఇదే తరహా పరిస్థితి 2023 డిసెంబర్ లోనూ వచ్చింది. ముందు గ్యాంగ్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ అనౌన్స్ చేశారు. చివరికి హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు వచ్చాయి. సలార్ వల్ల జరిగిన పరిణామాల్లో భాగంగా అలా చేయాల్సి వచ్చింది. మరి ఈసారి రాబిన్ హుడ్, తండేల్ లు ఇదే మాట మీద ఉంటాయా లేదానేది ఇప్పుడే చెప్పలేం. ట్విస్టు ఇక్కడితో అయిపోలేదు. హాలీవుడ్ క్రేజీ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కూడా డిసెంబర్ 20నే వస్తోంది. ఓవర్సీస్ లో దీన్ని కాచుకోవడం అంత సులభంగా ఉండదు. ముందు నుంచే థియేటర్ల ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on April 17, 2024 9:18 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…