టిల్లు స్క్వేర్ అనే సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి హైప్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోెరుగా జరిగాయి. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అయినా సరే ఆ సినిమా స్థాయికి వంద కోట్ల వసూళ్లు అన్నవి అనూహ్యం. అది కూడా పది రోజుల్లోపే సాధించడం అసామాన్యం. వంద కోట్ల మైలురాయి తర్వాత కూడా ఈ చిత్రం ఆగట్లేదు. నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. రిలీజైన మూడో వారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ‘టిల్లు స్క్వేర్’ దూకుడు చూపిస్తోంది. తొలి వారం రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకుని ఆశ్చర్యపరిచిన ‘టిల్లు స్క్వేర్’… రెండు, మూడు వీకెండ్లలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా 3 మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా అందుకుంది ఈ చిత్రం.
మంగళవారం ఫుల్ రన్ అయ్యేసరికి ‘టిల్లు స్క్వేర్’ 3 మిలియన్ మార్కును టచ్ చేసింది. సంక్రాంతికి రిలీజైన క్రేజీ మూవీ ‘గుంటూరు కారం’ కన్నా ‘టిల్లు స్క్వేర్’ యుఎస్‌లో ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ అంటే 4 మిలియన్ కేక్ వాకే అని అంచనాలు కలిగాయి. కానీ ఆ చిత్రం రెండున్నర మిలియన్ డాలర్లకు కాస్త ఎక్కువగా వసూళ్లు సాధించిందంతే. 3 మిలియన్ మార్కును కూడా అందుకోలేదు.
కానీ ‘టిల్లు స్క్వేర్’ లాంటి చిన్న సినిమా ఏకంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసింది. ఈ క్రమంలో పుష్ప, వాల్తేరు వీరయ్య సహా ఎన్నో పెద్ద సినిమాల యుఎస్ వసూళ్లను ‘టిల్లు స్క్వేర్’ అధిగమించడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’ వరల్డ్ వైడ్ ఫుల్ రన్ వసూళ్లు రూ.130 కోట్ల దాకా ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on April 17, 2024 9:08 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…