Movie News

వాయిదాలు చిన్న చిత్రాలకూ తప్పడం లేదు

రకరకాల కారణాల వల్ల వాయిదాలు కేవలం ప్యాన్ ఇండియా సినిమాలకే అనుకుంటాం కానీ చిన్న చిత్రాలకూ ఈ బెడద తప్పడం లేదు. ఈ వారం ఏప్రిల్ 19 విడుదల కావాల్సిన వాటిలో లవ్ మౌళి, శశివదనే పోస్ట్ పోన్ అయ్యాయి. బాక్సాఫీస్ బాగా డల్ గా ఉండటం, ఐపిఎల్ ఫీవర్ తో పాటు రాజకీయ వాతావరణం వల్ల జనాలు థియేటర్లకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. స్టార్ క్యాస్టింగ్ ఉన్నా బొమ్మ తేడా కొడితే నిర్మొహమాటంగా తిరస్కారం తప్పదని ఫ్యామిలీ స్టార్ నిరూపించింది. కంటెంట్ ఉంటే మొహాలు తెలియకపోయినా టికెట్లు తెగేలా మలయాళం డబ్బింగ్ ప్రేమలు సక్సెసయ్యింది.

ఎందుకొచ్చిన గొడవలెమ్మని నిర్మాతలు అన్ని రకాలుగా అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నవదీప్ చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన మూవీ లవ్ మౌళి. టైటిల్ తో పాటు థీమ్ కూడా వెరైటీగానే ఉంది. నాలుగు నిమిషాల ట్రైలర్ వదిలి టీమ్ పెద్ద రిస్క్ చేసింది. అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ తో ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. తెలిసిన క్యాస్టింగ్ లేకపోయినా శశివదనేకు మైత్రి లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ దొరికింది. దీంతో మంచి థియేటర్లు వస్తాయనుకుంటే సరిపడా బజ్ లేకపోవడంతో కొద్దిరోజులు ఆగాలని డిసైడయ్యారు. సో తప్పుకోక తప్పలేదు.

ఎండ తాకిడి కూడా ఈ పరిస్థితికి దారి తీసిందని చెప్పాలి. టిల్లు స్క్వేర్ ఒక్కటే ఈ ప్రతికూలతలన్నీ దాటి 125 కోట్ల గ్రాస్ ని తీసుకొచ్చి ఇంకా బలంగా ఉంది. ఈ శుక్రవారం పారిజాత పర్వంతో పాటు ఇంకొన్ని సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. దేని మీద బజ్ లేకపోవడంతో ప్రమోషన్ల కోసం అన్ని రకాల అస్త్రాలను వాడుతున్నారు. చైతన్య రావు, వైవా హర్ష, శ్రద్ధ దాస్ తదితరులు నటించిన పారిజాత పర్వం మీద అంచనాలైతే లేవు కానీ ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని టీమ్ వ్యక్తం చేస్తోంది. నిస్సారంగా ఉన్న థియేటర్లకు కొత్తగా ఉత్సాహం తెచ్చేదెవరో చూడాలి.

This post was last modified on April 17, 2024 10:00 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

14 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

50 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago