‘వకీల్ సాబ్’ కనుక సంక్రాంతికి మిస్ అయితే సమ్మర్ వరకు విడుదల ఆపుకోవాల్సి వస్తుంది. మొన్న వేసవిలో విడుదల కావాల్సిన సినిమా ఏడాది లేటవడమంటే దిల్ రాజుపై వడ్డీ భారం పెరిగిపోతుంది. అందులోను వకీల్ సాబ్ చిత్రాన్ని చాలా సింపుల్‍గా అటు పవన్‍కీ, ఇటు తనకూ లాభదాయకంగా దిల్ రాజు సెట్ చేసుకున్నాడు. ఈ చిత్రానికి పవన్ మినహా మరే స్టార్ ఎట్రాక్షన్ లేదు.
దర్శకుడు కూడా చిన్నోడే కావడంతో తక్కువ బడ్జెట్‍లో ఈ సినిమా పూర్తి చేసి మంచి లాభాలు చూడాలని భావించారు. తీరా కరోనా వచ్చి దిల్ రాజు ప్లాన్స్ భగ్నం చేసింది. కనీసం సంక్రాంతికి అయినా విడుదల చేసినట్టయితే కొంత నష్టం తప్పించుకోవచ్చునని దిల్ రాజు ఐడియా. అందుకే పవన్ షూటింగ్‍కి రాకపోయినా మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు.
నవంబర్ నాటికి పవన్ వచ్చేస్తాడనే దిల్ రాజు నమ్మకం పెట్టుకున్నాడు. నవంబర్‍లో పవన్ రాకపోతే కనుక వకీల్ సాబ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడం కుదరదు. సంక్రాంతికి వచ్చిన తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి కనుక సెంటిమెంట్ పరంగాను దిల్ రాజు ఆ సీజన్‍పై దృష్టి పెట్టాడు. మరి దిల్ మొర వకీల్ వింటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.
This post was last modified on September 15, 2020 10:35 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…