నార్త్ ఇండియన్ హీరోయిన్లు దక్షిణాది ఇండస్ట్రీల్లోకి వచ్చి ఆధిపత్యం చలాయించడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే. ఇక్కడ నటించే సగం మందికి పైగా హీరోయిన్లు ఉత్తరాది నుంచి ఇక్కడికి దిగుమతి అయిన వారే. కానీ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి పేరు సంపాదించడం.. అక్కడే కథానాయికలుగా స్థిరపడడం తక్కువ. త్రిష సహా ఎంతోమంది సౌత్ స్టార్ హీరోయిన్లు బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి వచ్చిన వాళ్లే.
నయనతార చాల ా లేటుగా ‘జవాన్’ మూవీతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. ఐతే ఈ సినిమా హిట్టయినా ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. కొత్త అవకాశాలూ దక్కలేదు. అసలు సౌత్ హీరోయిన్ల మైండ్ సెట్‌కి బాలీవుడ్ సెట్ కాదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరో సౌత్ హీరోయిన్ బాలీవుడ్ బాట పడుతోంది.
‘భీమ్లా నాయక్’తో తెలుగులో అడుగు పెట్టి బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరుసగా హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ సంపాదించిన మలయాళ బ్యూటీ సంయుక్త.. బాలీవుడ్లో అడుగు పెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆమె ముంబయిలో అడుగు పెట్టింది. ఒక పెద్ద హిందీ చిత్రం కోసం లుక్ టెస్ట్‌లో పాల్గొనేందుకే ఆమె అక్కడికి వెళ్లిందట. ఆమె వెంట ఫేమస్ కాస్టింగ్ డైరెక్టర్ ఒకరు కనిపించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సంయుక్త ఓ పేరున్న చిత్రంతోనే బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. త్వరలోనే దాని గురించి అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. ఐతే సౌత్ హీరోయిన్లకు ఏమాత్రం కలిసిరాని బాలీవుడ్లో సంయుక్త మాత్రం ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. తెలుగులో ఆమె ‘స్వయంభు’ లాంటి భారీ చిత్రంతో పాటు ఇంకో రెండు సినిమాల్లో నటిస్తోంది.
This post was last modified on April 16, 2024 6:30 pm
కాదేది కాపీకనర్హం అన్నట్టు సినిమాలకిచ్చే సంగీతంలోనూ ఈ పోకడ ఎప్పటి నుంచో ఉంది. విదేశీ పాటలను వాడుకోవడం, మత్తు వదలరాలో…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల…
ఏపీ డిప్యూటీ సిఎంగా కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తి చేయాల్సినవి కాకుండా భవిష్యత్తులో…
బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.…
మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి…
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆ పార్టీ అదినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని…