మాములుగా ఏదైనా బిజినెస్ లో ఫెయిలయితే మనస్థాపం చెంది రోజుల తరబడి డిప్రెషన్లోకి వెళ్లే జనాలను కోకొల్లలుగా చూస్తుంటాం. సినిమాల విషయంలో కూడా అంతే. ఒక డిజాస్టర్ పడితే కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు వదులుకుని సంవత్సరాల తరబడి గ్యాప్ తీసుకున్న వాళ్ళు అన్ని భాషల్లోనూ ఉన్నారు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం తన రూటే వేరంటున్నాడు. భారీ ప్యాన్ ఇండియా మూవీస్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతూ నిర్మాతలకు కోట్ల నష్టం వస్తున్నా సరే స్పీడ్ మాత్రం తగ్గించేదేలే అంటున్నాడు. సంవత్సరానికి నాలుగు రిలీజులు ఉండేలా మూడేళ్ళకు ప్లాన్ చేసుకున్నాడు మరి.
ఇటీవలే విడుదలైన బడేమియా చోటేమియా దారుణమైన డిజాస్టర్ అందుకుంది. నిన్న సోమవారం కేవలం 2 కోట్ల నెట్ మాత్రమే వసూలు కావడం చూస్తే అవమానం అనే మాట చిన్నదే. 350 కోట్లు పెట్టామని నిర్మాతలు చెప్పుకుంటే ఇప్పటిదాకా 50 కోట్ల నెట్ దాటేందుకే ఆపసోపాలు పడుతోంది. వన్ ప్లస్ వన్ టికెట్ల ఆఫర్ పెట్టినా థియేటర్లకు జనాలు ఎగబడటం లేదు. వంద కోట్ల గ్రాస్ వస్తేనే గొప్పనేలా పరిస్థితి దిగజారుతోంది. గతంలో సామ్రాట్ పృథ్విరాజ్ లాంటి భారీ చిత్రాలు సైతం ఇదే ఫలితాన్ని అందుకున్నా ప్రొడ్యూసర్లు మాత్రం అక్షయ్ తో తీయడం మానడం లేదు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఓకే చేసిన సినిమాలు 14 దాకా ఉన్నాయి. సర్ఫిరా, సింగం అగైన్, స్కై ఫోర్స్, వెల్కమ్ టు ది జంగల్, హాలిడే 2, హౌస్ ఫుల్ 5, హేరా ఫెరి 3, మంచు విష్ణు కన్నప్ప ఇలా చెప్పుకుంటే చాంతాడంత లిస్టు పోతూనే ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించనంత మాత్రాన సినిమాలు చేయడం తగ్గించనని చెబుతున్న ఈ సీనియర్ హీరోకు గత కొన్నేళ్లలో దక్కిన పెద్ద హిట్లు సూర్యవంశీ, ఓ మై గాడ్ 2 మాత్రమే. ఇవి కాకుండా మిగిలినవన్నీ కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయాయి. అయినా సరే ఇంత వయసులో ఏ మాత్రం ఖాళీ లేకుండా పరుగులు పెట్టడం విశేషమే.
This post was last modified on April 16, 2024 2:47 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…