సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కున్న డిమాండ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ లో విపరీతమైన బిజీతో మనకు సులభంగా దొరకడం లేదు కానీ తన మ్యూజిక్ కోసమే పడిగాపులు పడుతున్న దర్శక నిర్మాతలు ఎందరో ఉన్నారు. పది కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా ఏ మాత్రం భారంగా ఫీలవ్వని ప్రొడ్యూసర్లకు కొదవే లేదు. ప్రస్తుతం తెలుగులో అనిరుధ్ జూనియర్ ఎన్టీఆర్ దేవర, గౌతమ్ తిన్ననూరి మేజిక్ కు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్స్ గురించి యూనిట్ నుంచి వినిపిస్తున్న టాక్ వింటే ఎప్పుడెప్పుడు వస్తాయాని ఎదురుచూసేలా ఉంది.
ఇక అసలు మ్యాటర్ కొద్దాం. నిన్న విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం నుంచి మొదటి ఆడియో సింగల్ విడుదలయ్యింది. హీరోనే స్వయంగా పాడాడు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో విజిల్ పోడు అంటూ హుషారైన లిరిక్స్ గట్టిగానే ఉన్నాయి. అయితే విజయ్ ఫ్యాన్స్ ని ఇది పూర్తిగా సంతృప్తి పరచకలేకపోతోంది. ఊరికే వాయిద్యాల హోరు తప్ప ఆశించిన స్థాయిలో మెప్పించలేదని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఎప్పటి నుంచో యువన్ తోనే చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కస్టడీలోనూ ఈ ఇద్దరో కాంబో జరిగింది.
ఒకవేళ ఇదే గోట్ పాటలు అనిరుద్ రవిచందర్ కు ఇచ్చి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు అడగటంలో లాజిక్ ఉంది. ఎందుకంటే విక్రమ్, జైలర్, మాస్టర్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు బీజీఎమ్ చేసిన హెల్ప్ అంతా ఇంతా కాదు. వేరొకరు అయ్యుంటే వాటి అవుట్ ఫుట్ గొప్పగా వచ్చేది కాదనే కామెంట్ ని కొట్టిపారేయలేం. యువన్ శంకర్ రాజా ఒకప్పుడు అదిరిపోయే పాటలు ఇచ్చాడు కానీ ఈ మధ్య తన మేజిక్ అంతగా పని చేయడం లేదు. గోట్ లోని మిగిలిన పాటలైనా అంచనాలకు తగ్గట్టు ఇవ్వాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తాడో.
This post was last modified on April 15, 2024 3:21 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…