మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్ప షూటింగ్ తాలూకు ముఖ్యమైన షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరిగిన సంగతి విదితమే. తన కెరీర్ లోనే కాదు మోహన్ బాబు ఫిల్మోగ్రఫీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ఎపిక్ మల్టీస్టారర్ క్యాస్టింగ్ లిస్టు చూస్తేనే ఆడియన్స్ మతులు పోతున్నాయి. ప్రభాస్ ఇందులో శివుడిగా నయనతార పార్వతి కనిపిస్తారని ప్రచారం ముందు నుంచి జరిగింది. ఆదిపురుష్ లో రాముడిగా మెప్పించాడు కాబట్టి గరళకంఠుడిగానూ డార్లింగ్ పరకాయప్రవేశం చేస్తాడనే నమ్మకం విష్ణుది. అయితే అనూహ్యంగా ఇప్పుడీ క్యారెక్టర్లలో మార్పులు జరిగాయని లేటెస్ట్ అప్డేట్.
దాని ప్రకారం కన్నప్పలో ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటిస్తాడట. శివుడిగా అక్షయ్ కుమార్ ని లాక్ చేశారని తెలిసింది. ఓ మై గాడ్ 2లో అల్రెడీ ఇలాంటి పాత్రలో భేష్ అనిపించుకున్నాడు కాబట్టి సానుకూల స్పందన వచ్చిందట. కల్కి 2898 ఏడిలో శ్రీవిష్ణువు అంశతో కూడిన భైరవగా చేస్తున్న తరుణంలో మళ్ళీ కన్నప్పలో మహాశివుడిగా అంటే ఇబ్బందవుతుందని భావించి ప్రభాస్ వైపు నుంచే మార్పు కోసం రిక్వెస్ట్ వచ్చిందట. దీంతో విష్ణు దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ బృందంతో మాట్లాడి ఆ మేరకు దానికి అనుగుణంగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయించినట్టు సమాచారం.
ఇంకా ప్రభాస్ తాలూకు షూట్ జరగలేదు. త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతం కల్కి పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ రాజా సాబ్ కు వెళ్లేముందు కన్నప్పలో పాల్గొనే అవకాశం ఉంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం తదితరుల తారాగణంతో భారీగా రూపొందుతున్న కన్నప్పని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ ఉండొచ్చన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదట. ఒక భాగంలోనే కనివిని ఎరుగని రీతిలో కన్నప్పని ఒక విజువల్ ట్రీట్ గా రూపొందించేందుకు విష్ణు బృందం కష్టపడుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే శివరాత్రిని టార్గెట్ చేసుకుంటారట.
This post was last modified on April 15, 2024 10:34 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
రీసెంట్ గా స్పిన్నర్ అశ్విన్ టీమిండియాకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బౌలర్ కూడా…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…