ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు మోస్తున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మళ్ళీ చెప్పనక్కర్లేదు. టీజర్ లో ఎక్కువ కంటెంట్ రివీల్ చేయలేదనే అసంతృప్తి సగటు ప్రేక్షకుల్లో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ గెటప్ మాత్రం ట్రేడ్ వర్గాల్లో ఒక్కసారిగా హైప్ ని రెట్టింపు చేసింది. ఏకధాటిగా యూట్యూబ్ లో 138 గంటల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉండటంతో సరికొత్త రికార్డు నెలకొల్పిన పుష్ప 2 ఇప్పటిదాకా 111 మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త మైలురాళ్లవైపు పరుగులు పెడుతోంది. కొత్త పాటో ట్రైలరో వచ్చే లోగా షాకింగ్ ఫిగర్స్ నమోదు చేయడం ఖాయం.
దీన్ని బట్టే పుష్ప 2 మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ స్పందన ఊహించిన దానికన్నా ఎక్కువే. మొదటి రోజు వ్యూస్ లో సలార్ లాంటి వాటిని దాటలేకపోయినా ఇలా నాన్ స్టాప్ గా నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండటం మాత్రం విశేషమే. మైత్రి మూవీ మేకర్స్ వెయ్యి కోట్ల దాకా బిజినెస్ ని ఆశిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. దానికి తగ్గట్టే చేయబోయే ప్రతి పబ్లిసిటీ బజ్ పెరిగేందుకు ఉపయోగపడాలి. ఆ కోణంలో చూసుకుంటే పుష్ప 2 ది రూల్ సక్సెసయ్యిందనే చెప్పాలి. సుకుమార్ ప్లాన్ వర్కౌటయ్యింది.
ఏళ్ళ తరబడి దీని కోసమే ఇంకే సినిమా చేయకుండా ఉండిపోయిన అల్లు అర్జున్ తనకొచ్చిన జాతీయ అవార్డుకి మరింత వన్నె దక్కాలంటే సీక్వెల్ అంతకన్నా గొప్ప విజయం సాధించాలి. డెడ్ లైన్ పెట్టుకుని ఒత్తిడి మధ్య షూటింగ్ చేస్తున్న సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15 విడుదల తేదీని మిస్ చేయకూడదనే సంకల్పంతో ఉన్నారు. ఐటెం సాంగ్ ఇంకా పెండింగ్ ఉంది. ముందైతే ఇతర పాటలు, టాకీ పార్ట్ ఫినిష్ చేసి చివర్లో దీని సంగతి చూడబోతున్నారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, ధనుంజయ, రావు రమేష్, జగపతిబాబు పుష్ప 2లో కీలక తారాగణం.
This post was last modified on April 15, 2024 8:28 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…